మొటిమలు వెనక మిస్టరీని బట్ట బయలు చేసిన సాయి పల్లవి

Spread the love

ముఖంపై మొటిమలు వస్తే అమ్మాయిల ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది. యుక్త వయసులో చాలామందికి ఇవి ఇబ్బందిగా పరిణమిస్తాయి. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో మనో వేదనకు గురవుతారు. ఐతే తన వరకు మాత్రం మొటిమలే అందం అంటోంది సాయి పల్లవి. తనను చూశాక చాలామంది అమ్మాయిల్లోనూ మొటిమల విషయం బాధ పోయిందని ఆమె చెప్పింది. ‘‘ముందు నా ముఖంపై మొటిమలు వచ్చినపుడు నలుగురిలోకి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. కానీ తర్వాత ఆ ఫీలింగ్ పోయింది. నా తొలి సినిమా ‘ప్రేమమ్’లో ముఖానికి ఏ మేకప్ లేకుండా మొటిమలతోనే నటించాను.

అయినా అందరికీ నచ్చాను. నన్ను ఇలా చూసిన చాలామంది అమ్మాయిలు ఇకపై ‘తాము తమ లాగే ఉంటూ ఆత్మవిశ్వాసంతో బతకాలంనుకుంటున్నాం’ అని చెప్పడం చాలా సంతోషం కలిగించింది. అయినా మొటిమలుంటే ఏంటి? మనం ఎలా ఉన్నామో అలా ఉండటమే ఆత్మవిశ్వాసం’’ అని సాయిపల్లవి చెప్పింది. ఇక తన తొలి సినిమా ‘ప్రేమమ్’లో అవకాశం ఎలా వచ్చిందో సాయిపల్లవి చెబుతూ..

‘‘నేను డ్యాన్స్ షోలు చేశాక చదువు కోసం విరామం తీసుకున్నా. నేను మెడిసిన్ నాలుగో సంవత్సరంలో ఉండగా ఒర రోజు నాకో ఫోన్ వచ్చింది. తాను డైరెక్టర్ ఆల్ఫాన్సో అంటూ తనని తాను పరిచయం చేసుకున్నారు అవతలి వ్యక్తి. ఓ లవ్ స్టోరీలో కథానాయికగా చేయాలన్నారు. నన్నెవరో ఆటపట్టిస్తున్నారనుకున్నా. కానీ ఆయన ఓపిగ్గా చెప్పేసరికి నమ్మాల్సి వచ్చింది. చివరకు ఆయన తన వికీపిడియా పేజీ చూడమన్నారు. అప్పుడే ఆయనెంత పెద్ద వ్యక్తో అర్థమైంది. తర్వాత ఆయనకి సారీ చెప్పాను. సెలవుల్లోనే నటిస్తానంటూ చెప్పి ఆ సినిమాలో చేశా. అదే ప్రేమమ్’’ అని అంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.