రామ్ చరణ్ మనసు ఎంతగొప్పదో.. ఈ వీడియో చూస్తే అర్ధం అవుతోంది..

Spread the love

రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు చాలా మారిపోయాడు. త‌న‌లోని మాన‌వ‌తా వాదిని నిద్ర లేపుతున్నాడు. బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాదిరే అప్పుడ‌ప్పుడూ ప‌రుల‌కు సాయం చేస్తున్నాడు ఈ కుర్ర‌హీరో. మూగ జీవాల‌తోనే ఎక్కువ‌గా ఆడుకుంటున్నాడు. త‌న ఇంట్లోనే నెమ‌ళ్లు.. కుక్క‌లతో పాటు గుర్రాల‌ను కూడా ప్ర‌త్యేకంగా పెంచుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఈ మ‌ధ్య స్వ‌చ్ఛంద కార్య‌క్ర‌మాల్లోనూ ఎక్కువగా పాల్గొంటు న్నాడు. ఈ మ‌ధ్యే సతీమణి ఉపాసనతో కలిసి ప్రభుత్వేతర సంస్థ ఆశ్రయ్ – అక్రూతి లోని పిల్లలతో క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌రుపుకున్నాడు. అక్క‌డే ఉండి పిల్ల‌లతో గడిపారు. వారితో కలిసి చరణ్ కేక్ త‌యారు చేశాడు. డాన్సులు చేశాడు. ఇంకా వారిలో కలిసిపోతూ మెగా దంపతులు నవ్వులు పూయించారు. ఇక వారందరికీ గుర్తుండిపోయేలా ఒక ఫొటోను కూడా దిగారు. ఇక అభిమానుల విష‌యంలోనూ చాలా మారిపోయాడు చ‌ర‌ణ్. ఒక‌ప్పుడు వాళ్ల‌తో మాట్లాడ‌టానికి పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌ని చ‌ర‌ణ్ ఇప్పుడు ఫ్యాన్స్ తోనే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాడు. ఆ మ‌ధ్య ద‌ర్శ‌కుడు ఆడియో వేడుక‌లో త‌న బుల్లి అభిమాని ప‌రుశురాం మృతికి మౌనం పాటించాడు. అంతేకాదు.. వాళ్ల కుటుంబానికి సాయం చేస్తాన‌ని చెప్పాడు. ఇక ఆ మ‌ధ్య ఓ ఆడియో వేడుక‌లో ప‌వ‌న్ ప‌వ‌న్ అంటూ అరుస్తున్న ఫ్యాన్స్ ను ఉద్దేశ్యించి చ‌ర‌ణ్ చేసిన క‌మెంట్స్ అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నాయి. బాబాయ్ పై త‌న ప్రేమ‌ను మాట‌ల్లో చెప్ప‌లేను.. త‌న కుటుంబం గుండెల్లో ఎక్కువ‌గా ఉంటుంది.. మాట‌ల్లో త‌క్కువ‌గా ఉంటుంది ప్లీజ్ అర్థం చేసుకోండంటూ చాలా మెచ్యూర్డ్ గా స‌మాధానం చెప్పాడు చ‌ర‌ణ్. ఇక ఈ మ‌ధ్యే ఓ హ్యాండీకాప్ అభిమాని కోసం త‌నే వ‌చ్చి క‌లిసాడు. ఆమెకు ఆర్థిక సాయం కూడా చేసాడు చ‌ర‌ణ్. ఇలా మొత్తానికి ఈ మ‌ధ్య కాలంలో చ‌ర‌ణ్ చేస్తోన్న కార్య‌క్ర‌మాల‌న్నీ అభిమానుల మ‌న‌సు దోచుకుంటున్నాయి. ఇక వేష‌ధార‌ణ‌లో కూడా చాలా మార్పు వ‌చ్చింది. ఓ యోగిలా ఎక్క‌డికి వెళ్లినా.. కేవ‌లం లాల్చి పైజామాతో వ‌స్తున్నాడు చ‌ర‌ణ్. మొత్తానికి ఈ మార్పు చ‌ర‌ణ్ పై సాధార‌ణ ప్రేక్ష‌కుల్లో ఉన్న‌ చెడు అభిప్రాయాన్ని తొల‌గిస్తున్నాయి.

Loading...

Leave a Reply

Your email address will not be published.