రకుల్ తో  మోక్షజ్ఞ రొమాన్స్..!!

Spread the love
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా తెరంగేట్రం గురించి గత రెండేండ్లుగా పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. గతేడాదినే మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలని బాలకృష్ణ భావించారు. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణిలో నటింపజేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్‌ కాలేదు. ఇక ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారైపోయింది.. ప్రస్తుతం బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్‌ ఎన్టీఆర్‌ లో తండ్రి పాత్రలో నటిస్తున్నారు.
క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందులో చిన్నప్పటి ఎన్టీఆర్‌ పాత్రలో మోక్షజ్ఞ కనిపిస్తారట.   ఎన్టీఆర్ టీనేజ్ లవ్ స్టోరీలో భాగంగా మోక్షజ్ఞ సరసన స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేసినట్లుగా ప్రచారం మొదలైపోయింది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్.. రకుల్, మోక్షజ్ఞ మధ్య సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయని అంటున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటన చేయడం లేదు.ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో కనిపించనుంది.
Loading...

Leave a Reply

Your email address will not be published.