రాజమౌళి హీరోయిన్స్  వాళ్లేనా..!!

Spread the love
 రాజ‌మౌళి సినిమా అంటే ఇప్పుడు ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ సినిమాలు కూడా ఇప్పుడు ఈయ‌న ఇమేజ్ ముందు దిగ‌దుడుపే. ద‌ర్శ‌క‌ధీరుడి సినిమా అంటే ఈజీగా ఇప్పుడు 400 కోట్ల వ్యాపారం జ‌రుగుతుంది. అది ఆయ‌న‌కు ఉన్న బ్రాండ్. బాహుబ‌లి లాంటి భారీ ప్రాజెక్ట్ త‌ర్వాత ఆయ‌న రామ్ చ‌ర‌ణ్-ఎన్టీఆర్ లాంటి సూప‌ర్ స్టార్స్ తో మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన‌ప్ప‌టి నుంచీ ఈ ఇందులో హీరోయిన్లుగా ఎవ‌రు న‌టించ‌బోతున్నార‌నే విష‌యంపై ఎన్నో చ‌ర్చ‌లు న‌డుస్తూనే ఉన్నాయి. తాజాగా దీనికి తెర‌ప‌డిన‌ట్లే క‌నిపిస్తుంది. రాజ‌మౌళి క‌న్ను మ‌హాన‌టిపై ప‌డిన‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి. కీర్తిసురేష్ న‌ట‌న‌కు ఫిదా అయిపోయిన ద‌ర్శ‌క‌ధీరుడు.. త‌న సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ఈ భామ‌నే ఫైన‌ల్ చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.
ఇక రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా ముందు జిగేల్ రాణిని ఎంచుకున్న‌ట్లుగా తెలుస్తుంది. అంటే పూజా హెగ్డే అన్న‌మాట‌. ఇప్ప‌టికే రంగ‌స్థలంలో వీళ్లు క‌లిసి చేసిన పాట‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. దాంతో ఇదే జోడీని కొన‌సాగించాల‌ని ముందు భావించాడు రాజ‌మౌళి. కానీ ప్ర‌స్తుతం ఈమె ప్ర‌భాస్.. ఎన్టీఆర్.. మ‌హేశ్ లాంటి స్టార్ హీరోల‌తో న‌టిస్తూ మ‌రో ఏడాదిన్న‌ర వర‌కు బిజీగానే ఉండ‌బోతుంది. మ‌ళ్లీ త‌న సినిమాకు డేట్స్ ప్రాబ్ల‌మ్ వ‌స్తే బాగోదు అని ఆమెను కాద‌ని ర‌కుల్ వైపు రాజ‌మౌళి అడుగేస్తున్నాడ‌ని తెలుస్తుంది. అక్టోబ‌ర్ నుంచి కాకుండా ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి నుంచి ప‌ట్టాలెక్క‌బోతుంది. కీర‌వాణి సంగీతం అందించ‌నున్న ఈ చిత్రాన్ని దాన‌య్య 300 కోట్ల‌తో నిర్మించనున్నాడు. 2020లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.
Loading...

Leave a Reply

Your email address will not be published.