చంపేందుకు సిద్ధమయ్యారు : వర్మ, మహేష్ కి కత్తి దించిన పూనమ్

Spread the love
బూతు బూతు ఒక్కటయ్యాయి.. ట్విట్టర్ వేదికగా రాంగోపాల్ వర్మ యూరప్ కు చెందిన పోర్న్ స్టార్ మియా శృంగార వీడియోను పోస్టు చేయడం.. దానికి ఆహో ఓహో అంటూ తెలుగు వివాదాస్పద రివ్యూరైటర్ కత్తి మహేశ్ పొగడడం జరిగిపోయాయి. ఈ బూతు వీరులు పరస్పర పొగడ్తలకు స్పందించిన హీరోయిన్ పూనమ్ కౌర్ ఇద్దరికీ షాకింగ్ ట్వీట్ సంధించి దిమ్మదిరిగిపోయేలా చేసింది. ఇటీవల పవన్ కళ్యాణ్ కు తనకు సంబంధం అంటగట్టి ఆడుకున్న కత్తి మహేశ్ కు పూనమ్ కౌర్ తాజాగా వర్మ పోర్న్ వీడియోను బేస్ చేసుకొని సెటైర్లు వేసింది. పూనమ్ కౌర్ ట్వీట్ చేస్తూ.. ‘‘ఇండియాలో సాధారణ భారతీయ యువతులు కంటే పోర్న్ స్టార్లే మంచి జీవితం, గౌరవాన్ని పొందుతున్నారు. ఇక్కడి యువతులు దేనిపైనైనా స్పందిస్తే వారిపై లేనిపోని నిందలు వేస్తు అసభ్యంగా మాట్లాడతారు.
అంతా కలిసి ఆ యువతుల ఆత్మ, మనస్సు, శరీరాన్ని చంపేందుకు సిద్ధమవుతారు’’ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఆమె కామెంట్స్‌ కత్తి మహేశ్ ను ఉద్దేశించే కావడంతో సోషల్ మీడియాలో ఆమెకు సపోర్టుగా నెటిజన్లు నిలుస్తున్నారు.. ఇక అంతకుముందు రాంగోపాల్ వర్మ విడుదల చేసిన పోర్న్ వీడియో ట్రైలర్ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ -జీఎస్టీ’కి కత్తి మహేష్ సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. ‘‘మియా ఒక దేహం కాదు. విశ్వవ్యాపితమైన ఒక మోహన రూపం. మియా ఒక స్త్రీ కాదు. స్త్రీ లైంగిక స్వేఛ్చా స్వాతంత్ర్యాలకు ప్రతిరూపం. కొన్ని యుగాలుగా అణచివేయబడ్డ స్త్రీ వాంఛలకు మద్దతుగా మియా మాటల్లో, వర్మ అనే ఒక పురుషుడు విప్పిన గొంతుక ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అని ట్వీట్ చేశాడు. వర్మ, కత్తి మహేశ్ కు దిమ్మదిరిగేలా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
Loading...

Leave a Reply

Your email address will not be published.