కత్తి కాదు సుత్తి కాదు.. పవన్ గురించి ఈ అమ్మాయి చెప్పిన విషయం తెలిస్తే కన్నీళ్లే..!

పవన్ కళ్యాణ్ తాజా సినిమా అజ్ఞాతవాసి థియేటర్స్ లో సందడి చేస్తోంది.. ఓ వైపు క్రిటిక్ మహేశ్ కత్తి పవన్ కళ్యాన్ పై పదునైన విమర్శలు చేశాడు. ఈ కత్తి మహేశ్ గోల అలా ఉంచితే ఓ అమ్మాయి సోషల్ మీడియాలో పవన్ నిజస్వరూపం గురించి పెట్టిన పోస్టు ప్రస్తుతం సంచలమైంది. ఎవరా అమ్మాయి..? ఏంటా నిజస్వరూపం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. పవన్ కళ్యాణ్ తన తాజా సినిమా అజ్ఞాతవాసి షూటింగ్ ను రెండు నెలల క్రితం కాశీలో తీశారు.
అక్కడ షూటింగ్ జరుపుకుంటున్నప్పుడు అక్కడే పనిచేసే తెలుగు కుర్రాడు పవన్ తో ఫొటోలు దిగాడు. ఈ మధ్య వారం కింద హైదరాబాద్ వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు.. ఈ విషయాన్ని పేపర్లో చదవిన పవన్ చలించిపోయాడు. వెంటనే తన సహాయకులకు ఆ కుర్రాడి అడ్రస్ కనుక్కోమని చెప్పి లక్ష రూపాయల చెక్కును పంపించాడట.. అలా పవన్ చేసిన సాయం మీడియాకు కానీ, సన్నిహితులకు కానీ ఎవ్వరికీ తెలియదు.. కానీ కాశీకి చెందిన హారిక నంది అనే అమ్మాయి ఈ విషయాన్ని బయటపెట్టింది. ఫేస్ బుక్ లో ఈ మేరకు పోస్టు చేసింది. హారీకి తన పోస్టులో ‘మా అన్నయ్య ఫ్రెండ్ కాశీలో పనిచేస్తున్నాడని.. అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ లో పవన్ ను కలిసి ఫొటో తీయించుకున్నాడని.. ఆ తర్వాత హైదరాబాద్ వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించాడంది.
అయితే ఈ విషయాన్ని తెలుసుకొని కాశీలోని వారి కుటుంబానికి లక్ష రూపాయలను పవన్ పంపించాడని.. పబ్లిసిటీకి దూరంగా పవన్ ఆ కుటుంబాన్ని ఆదుకొని గొప్ప మనసు చాటుకున్నాడని’ అమ్మాయి రాసుకొచ్చింది. ఇలా పవన్ కళ్యాణ్ ఎంతో మందికి ప్రచారానికి దూరంగా సాయం చేసి ఆదుకున్నాడు. బయటకొచ్చినవి కొన్నే.. బయటకు రానివి ఎన్నో.. పవన్ లోని ఉద్దాత్త గుణమే ఆయన్ను మనసున్న మారాజును చేసింది. కత్తి మహేవ్ లాంటి వారు ఇప్పటికైనా పవన్ సేవాగుణాన్ని చూసి విమర్శలు మానాలని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.
Loading...

Leave a Reply

Your email address will not be published.