ఆకట్టుకుంటున్న నర్తన శాల ఫస్ట్ లుక్..!!

Spread the love
ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నాగశౌర్య హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ నర్తనశాల’. శ్రీనివాసరావు దర్శకత్వంలో ఉషా ముల్పూరి, శంకర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకుంది.. ఇట‌లీలో చిత్రీక‌రించిన సాంగ్ తో మొత్తం షూటింగ్ ను ముగించింది.. ఇటలీ నుంచి చిత్ర యూనిట్ హైద‌రాబాద్ కు తిరిగివ‌చ్చింది.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది.. ఆగ‌స్ట్ లో విడుద‌ల కానున్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ను నిన్న రిలీజ్ అయ్యింది.. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన ఈవెంట్ లో దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అని క్లారిటీ ఇచ్చాడు.
టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే ఫ్యాన్స్ లో ఈ సినిమా చుట్టూ క్యూరాసిటీ క్రియేట్ అయింది. దానికి తోడు ‘ఛలో’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత  నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్  పై నిర్మిస్తున్న సినిమా కావడంతో  ఈ సినిమా చుట్టూ భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఫ్రెష్ లుక్ తో సినిమా ప్రమోషన్స్ బిగిన్ చేసిన యూనిట్ త్వరలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.
Loading...

Leave a Reply

Your email address will not be published.