ఫస్ట్ పబ్లిక్ టాక్.. సినిమా దొబ్బింది.. పాత సినిమాలు చూస్తే సరిపోతది.

Spread the love

గత కొద్ది కాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని. నేచురల్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ యువ హీరో.. ఇప్పుడు టాలీవుడ్‌లోని స్టార్ హీరోల జాబితాలో చేరుపోయాడు. తాజాగా నాని హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా MCA. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనేది ఉపశీర్షిక. హిట్ చిత్రాల దర్శకుడు దిల్ రాజు నిర్మించారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు.

‘ఫిదా’ ఫేమ్ సాయి పల్లవి ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. రాజీవ్ కనకాల, భూమిక, ఆమని, సీనియర్ నరేష్ ఇలా భారీ తారగణమే ఉంది. క్రిస్మస్ కానుకగా నేడు (డిసెంబర్ 21న) భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని విడుదల చేశారు అయితే ఇన్నాళ్లు సక్సెస్‌లను ఎంజాయ్ చేస్తున్న నానికి ఈసారి నిరాశ ఎదురైనట్లే కనిపిస్తోంది. ఎన్నో అంచనాలతో సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. రొటీన్ ఫార్ములా అని సినిమాలో కొత్తదనం ఏమీ లేదని అంటున్నారు.

ఇప్పటికే విదేశాల్లో ప్రీమియర్ షోలు చూసినవారు, ఇక్కడ బెనిఫిట్ షోలు చూసినవారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ ఆఫ్ మరీ రొటీన్‌గా ఉందని అంటున్నారు. సినిమాకు సెంటిమెంటల్ సీన్స్ ప్రధాన బలమని.. కానీ మ్యూజిక్, సెకండ్ హాఫ్ సినిమాను దెబ్బకొట్టాయని టాక్. ముఖ్యంగా దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.