ఎంసీఏ మూవీ రివ్యూ

Spread the love

కథ :

ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథే ఈ MCA అంటూ చిత్ర యూనిట్ ముందుగానే చెప్పేసారు. నాని అన్న, వదినలుగా రాజీవ్ కనకాల, భూమిక నటించగా… పిన్ని, బాబాయ్‌లుగా నరేష్, ఆమనిలు నటించారు. పల్లవి అలియాస్ చిన్ని పాత్రలో హీరోయిన్ సాయిపల్లవి నానితో జతకట్టింది. ఇక సినిమా కథలోకి వెళితే పిన్ని, బాబాయ్, అన్న, ఫ్రెండ్స్ ఇదే తన ప్రపంచం అనుకునే నాని జీవితంలోకి వదినగా భూమిక(జ్యోతి) ఎంట్రీ ఇస్తుంది. భూమిక ఓ ఆర్టీవో ఆఫీసులో ఉద్యోగం చేస్తుంటుంది.

తనకు వరంగల్‌కు ట్రాన్స్‌ఫర్ అవ్వడంతో భూమికతో పాటు నాని కూడా వదినకు తోడుగా వరంగల్ వెళ్తాడు. వదినపై గౌరవం వున్నప్పటికీ… తను చెప్పే పనులకు నాని ఎప్పుడు చిరాకు పడుతుంటాడు. ఇదిలా వుండగా నాని జీవితంలోకి పల్లవి ఎంట్రీ ఇస్తుంది. నానిని ఆటపట్టిస్తూ, లవ్ చేస్తుంటుంది. ఇలా అటు వదిన, ఇటు ప్రేమించే అమ్మాయి మధ్యలో నలిగిపోతున్న నానికి వీరిద్దరి విషయంలో ఓ క్లారిటీ వచ్చేస్తుంది. అటు వదినను, ఇటు సాయిపల్లవిని అర్థం చేసుకోవడం మొదలుపెడతాడు.

ఇంతలో భూమిక పనిచేస్తున్న ఆఫీసులో ఓ సమస్య ఏర్పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న నాని.. తన వదినకు అండగా వుండాలని ఫిక్స్ అయ్యి, వదినకు ఎలాంటి సమస్య రాకుండా ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటాడు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా నాని వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అసలు నానికి ఎదురైన సమస్యలేంటీ? నాని జీవితంలో భూమిక ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనే అంశాలు వెండితెరపై చూస్తేనే బాగుంటుంది.

ఎలా ఉంది.. ఎలా చేశారు.. :

MCA మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాకు ముగ్గురు మేజర్ ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. నాని, భూమిక, సాయిపల్లవి. న్యాచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నాని.. మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలో ఒదిగిపోయాడు. సాయిపల్లవి ఈ సినిమాలో మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని కీలక విషయాలు, స్క్రీన్‌ప్లే తప్ప స్టోరీ లైన్ ఇదేనంటూ చిత్ర యూనిట్ ముందుగానే ప్రకటించేసారు. ఈ సినిమా క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరికీ నచ్చుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా వుంది.

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. ఇక దర్శకుడు శ్రీరామ్ వేణు తను రాసుకున్న కథను అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగాడు. నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకోవడమే కాకుండా స్క్రీన్‌ప్లే పరంగా బాగా చూపించారు. ముఖ్యంగా నాని, సాయిపల్లవి, భూమిక, విజయ్ వర్మల పాత్రలను బాగా డిజైన్ చేసారు. దర్శకుడిగా శ్రీరామ్ వేణు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక ముందుగానే చెప్పినట్లుగా నిర్మాత దిల్‌రాజు తన బ్యానర్‌లో MCAతో ఆరవ హిట్టు కొట్టాడని చెప్పుకోవచ్చు. రాజు, శిరీష్, లక్ష్మణ్ సంయుక్తంగా అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరగా MCA చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని చెప్పుకోవచ్చు.

Loading...

Leave a Reply

Your email address will not be published.