అందులో కాజల్ రికార్డ్ కొట్టేసింది

Spread the love

ప్రస్తుతం సోషల్ మీడియాని తారలు ఏ విధంగా వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికపుడు వారి అనుభవాలను సినిమాలకు సంబంధించి కొత్త కొత్త విషయాలను అభిమానులతో పంచుకుంటూ వారికి దగ్గరవుతున్నారు. ప్రస్తుతం చాలామంది తారలు సోషల్ మీడియాని తెగ వాడేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కి కూడా ఈ మార్గం చాలా ఉపయోగపడుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే.. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం నెటిజన్స్ ని చాలా ఆకర్షిస్తోంది. దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ ఫెస్ బుక్ లో చాలా ఫెమస్ అయ్యింది. అంతే కాకుండా ఒక రికార్డును కూడా సృష్టించింది. కాజల్ ఫెస్ బుక్ పేజ్ ని మొత్తంగా 24మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

సౌత్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న నటిగా కాజల్ రికార్డ్ సృష్టించింది. అమ్మడు మెగా హీరోలతో నటించిన సంగతి తెలిసిందే. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ తో ప్రస్తుతం ఎమ్మెల్యే సినిమాను చేస్తోంది. అంతే కాకుండా హిందీ క్వీన్ రీమేక్ లో కూడా నటిస్తోంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.