ఫస్ట్ పబ్లిక్ టాక్.. వామ్మో ఏం సినిమా.. షాక్ లోనే ఉన్నాం ఇంకా..

Spread the love

అక్కినేని అఖిల్ ‘హలో’ అంటూ పలకరించేశాడు. ఈరోజు (డిసెంబర్ 22) తెల్లవారుజాము నుంచే థియేటర్లలో సందడి చేశాడు. అటు అక్కినేని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హలో’ సినిమా వెండితెరపై దర్శనమిచ్చింది. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై ఇటు అఖిల్‌తో పాటు అటు అక్కినేని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలను సజీవం చేస్తూ ‘హలో’పై సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా బ్లాక్‌బస్టర్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామునే రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలు పడిపోయాయి.

ఈ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అన్నీ పాజిటివ్ రెస్పాన్స్‌లే.. ఎక్కడా నెగిటివ్ కనిపించడంలేదు. విక్రమ్ కె కుమార్ స్క్రీన్‌ప్లే సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు. అఖిల్ చాలా కష్టపడ్డాడని, స్టంట్స్ సూపర్‌గా చేశాడాని పేర్కొంటున్నారు. ఇక పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అదిరిపోయిందట. యాక్షన్ సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారట.

అనూప్ రూబెన్స్ తన కెరీర్‌లోనే ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారని టాక్. మొత్తంగా సినిమా బ్లాక్ బస్టర్ అని, అఖిల్ కెరీర్‌లో చిరకాలంగా ఉండే సినిమా అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, ఇక సెకండ్ హాఫ్ అయితే మాటల్లో చెప్పలేమని ట్వీట్ చేస్తున్నారు. ‘ఓ సినిమా హిట్టా ఫట్టా అని తేల్చేది సెకండ్ హాఫ్. హలో సినిమా హిట్‌కు కారణం సెకండ్ హాఫ్. రెండో భాగం బాగోకపోతే ఫలితం ఎలా ఉంటుందో ఎంసీఏ నిరూపించింది’ అని ఓ సినీ ప్రేమికుడు ట్వీట్ చేశాడు. క్లైమాక్స్‌లో దర్శకుడు విక్రమ్ టేకింగ్ అద్భుతమట. సినిమాలో ఏ సన్నివేశాన్ని ప్రేక్షకుడు ముందుగా ఊహించలేడట. మొత్తంగా చూస్తే సినిమా సూపర్ హిట్ అంటున్నారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.