నవాబ్ లో ఆమె నటనే హైలైట్.. డయానా నటన పై పలువురి ప్రశంశలు..!!

Spread the love

నవాబ్ సినిమా థియేటర్స్ కి వచ్చింది.సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ఇంట్రెస్ట్ హిట్ కొట్టాలని తీసిన ఈ మల్టీ స్టారర్ సినిమా లో ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి, శింబు, అరవింద స్వామి, జ్యోతిక, అరుణ్ విజయ్, అతిధి రావు హైదరి, డయానా ఎర్రప్ప ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.. ప్రేక్షకుల్లో ఏంన్నో అంచనాలున్న ఈ సినిమాలో డయానా ఎర్రప్ప నటన హైలైట్ గా నిలిచింది..తనతో నటిస్తున్న వారు సూపర్ స్టార్స్ అయినా ఏమాత్రం తడబడకుండా సినిమా కి వచ్చిన ప్రేక్షకుల మన్ననలను పొందింది డయానా.

శింబు కి జోడిగా నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లడం ఖాయమని ఆమె యాక్టింగ్ ప్రతి ఒక్కరు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ సినిమా తో అటు కోలీవుడ్ లో, టాలీవుడ్ లో ఒకే టైమ్ లో పరిచయం కాబోతున్న డయానా ఎర్రప్ప మంచి పేరు రావడంతో ఆమెకు మరిన్ని ఆఫర్స్ తథ్యం అంటున్నారు.. ముఖ్యంగా శింబు తో ఆమె పోటాపోటీగా నటించారు అని చెప్తున్నారు. అటు గ్లామర్ తో మెరులు మెరిపించగా , ఇటు నటన లో సూపర్ అనిపించుకున్న డయానా కి తెలుగు, తమిళం భాషల్లో బ్రహ్మరథం పట్టడం ఖాయం..

లైకా ప్రొడక్షన్స్ వారు , మద్రాస్ టాకీస్ వారు సంయుక్తంగా నిర్మించగా ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరగగా విడుదలకు ముందే సినిమాపై మంచి పొజిటివ్ టాక్ రావడం చిత్ర యూనిట్ కి ప్లస్ పాయింట్ అయింది.. ప్రస్తహుతం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుండగా, డయానా నటనకి ప్రముఖులు సైతం ముగ్దులయ్యారు..

Loading...

Leave a Reply

Your email address will not be published.