చినబాబు ట్రైలర్ టాక్.. !!

Spread the love

కార్తి సినిమాల‌కు త‌మిళ్ లోనే కాదు.. తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక్క‌డ ఆయ‌న సినిమాలు 10 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేస్తాయి. గ‌తేడాది ఖాకీ కూడా సూప‌ర్ హిట్ అయింది. ఇప్పుడు చిన‌బాబు అంటూ ప‌క్కా రైతు క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు ఈ హీరో. పాండిరాజ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో రైతుగా న‌టిస్తున్నాడు కార్తి. ప‌క్కా ప‌ల్లెటూరి నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా చిన‌బాబు. స‌యేషా సైగ‌ల్ ఇందులో కార్తితో జోడీక‌ట్టింది. త‌మ్ముడితో అన్న‌య్య నిర్మిస్తోన్న తొలి సినిమా ఇది.

2డి ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకంపై సూర్య నిర్మించాడు ఈ చిత్రాన్ని. తెలుగులో మిర్యాల ర‌వీందర్ రెడ్డి విడుద‌ల చేస్తున్నాడు. జులై 13న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ట్రైల‌ర్ చూస్తుంటే చాలా రోజుల త‌ర్వాత అస‌లైన అర‌వ సినిమా చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. ఆ ఎడ్ల పందాలు.. లుంగీ క‌ట్టుకుని ర‌చ్చ చేయ‌డాలు.. పోలేర‌మ్మ జాత‌ర‌లు అవ‌న్నీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించాడు ద‌ర్శ‌కుడు పాండిరాజ్. తెలుగులో ఏమో కానీ త‌మిళ‌నాట మాత్రం చిన‌బాబు దుమ్ము దులిపేలా క‌నిపిస్తున్నాడు. క‌థ బాగుంటే ఇక్క‌డ కూడా బాగానే క‌నెక్ట్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. రైతు కాన్సెప్ట్ కావ‌డంతో ఈ చిత్రంపై ఆశ‌లు బాగానే పెట్టుకున్నారు సూర్య బ్ర‌ద‌ర్స్.

Loading...

Leave a Reply

Your email address will not be published.