అనిరుధ్ కి సెకండ్ అయినా పేరు తెచ్చేనా..!!

Spread the love
అనిరుధ్ ర‌విచంద్ర‌కు. కుర్రాడు పాతికేళ్ల‌కే రాక్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సౌత్ ఇండియాలో దేవీ శ్రీ ప్ర‌సాద్ కు స‌రైన మొగుడు ఎవ‌రైనా ఉన్నారంటే అది ఒక్క అనిరుధ్ మాత్ర‌మే. త‌న డాన్సులు.. ప‌ర్ఫార్మెన్స్.. పాట‌ల‌తో ప్రేక్ష‌కులకు బాగా చేరువ‌య్యాడు అనిరుధ్. అయితే ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చినా తెలుగు ప్రేక్ష‌కుల‌కు మాత్రం ఊహించిన రేంజ్ లో ప‌రిచ‌యం కాలేక‌పోయాడు ఈయ‌న‌. అజ్ఞాత‌వాసి లాంటి భారీ ప్రాజెక్ట్ కు చెత్త మ్యూజిక్ ఇచ్చి చేతులు కాల్చుకోవడ‌మే కాకుండా.. చివాట్లు కూడా తిన్నాడు అనిరుధ్.
ఆ కార‌ణంతోనే ఎన్టీఆర్ సినిమాను కూడా వ‌దిలేసుకోవాల్సి వ‌చ్చింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా మిస్సైనా.. అదే సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో నాని హీరోగా వ‌స్తున్న జెర్సీ సినిమాకు అనిరుధ్ ను తీసుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని క్రికెట‌ర్ గా న‌టిస్తున్నాడు. క‌థ 1980-90 మ‌ధ్య‌లో జ‌రుగుతుంది. దీనికి అనిరుధ్ అయితే సంగీతం బాగుంటుంద‌ని ఫీల్ అవుతున్నాడు ద‌ర్శ‌కుడు. నాని కూడా అనిరుధ్ తో వ‌ర్క్ చేయాల‌ని చూస్తున్నాడు. ఈ మ‌ధ్య గోపీసుంద‌ర్.. హిప్ హాప్ త‌మిళ‌న్ అంటూ ప‌క్క సంగీత ద‌ర్శ‌కుల‌కు బాగానే ఫిదా అయిపోతున్నాడు దేవీ. మ‌రి ఇప్పుడు ఏం అవుతుందో చూడాలిక‌..
Loading...

Leave a Reply

Your email address will not be published.