అందరి ముందు రష్మీని పెళ్లికి ఓప్పించిన సుధీర్.. ఇదిగో ఫ్రూప్..!

Spread the love
సౌత్ ఇండియాలోనే అతి పెద్ద డాన్స్ రియాలిటీ షో ఢీ. ఈ డాన్స్ డాన్స్ షో 9 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకొని , ఇపుడు “ఢీ-10” గా ప్రేక్షకులని అలరిస్తుంది. ప్రదీప్ యాంకర్ గా, రష్మి, సుడిగాలి సుధీర్, హేమంత్, వర్షిణిలు టీమ్ లీడర్స్ గా, హీరోయిన్ ప్రియమణి, శేఖర్ మాష్టర్ లు జడ్జిస్ గా వ్యవహరిస్తున్న ఈ షో లో కంటిస్టెంట్స్ డాన్స్ తో పాటు, యాంకర్ , టీమ్ లీడర్స్ చేసే కామెడీ కూడా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా సుడిగాలి సుధీర్, రష్మీ , ప్రదీప్ చేసిన కామెడీ చాల ఫన్నీగా ఉంది. రష్మీ నువ్వు ఏడవకు చూడలేకపోతున్నఅని సుధీర్ అనడంతో, ఎందుకు చులేకపోతున్నావ్ అని ప్రదీప్ అడుగగా, కాబోయే వాళ్ళు ఏడిస్తే ఎలా చూస్తాం, ఈ డాన్స్ షో అవ్వగానే నాకు రష్మీ కి పెళ్లి కదా అని సుదీర్ చెప్పగానే అందరు షాక్ అయ్యారు.
ఇది బేస్ చేసుకొని ప్రదీప్ యూట్యూబర్స్ మీద సెటైర్ వేసాడు. దీనికోసమే యూట్యూబర్స్ ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు, రాసుకోండి ఇక అని పంచ్ వేసాడు. మొన్న తన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తన తల్లిదండ్రులు బాధపడేలా వార్తలు రాసెయ్యడంతో ఈ విధంగా వారిపై సెటైర్స్ వేసాడు ప్రదీప్. ఇక రష్మీ మాట్లాడుతూ సుధీర్ నేను కూడా నువ్వు బాధపడితే చూడలేను అని చెప్పి ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. ఈ విషయాన్ని పట్టుకొని సుధీర్ పెద్దది చేసేసి స్టేజ్ ఫై రచ్చ రచ్చ చేసేసాడు. వారు చేసిన ఆ స్కిట్ అందరి చేత నవ్వులు పూయించింది.
Loading...

Leave a Reply

Your email address will not be published.