డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో యాంకర్ ప్రదీప్ కు 3 సంవత్సరాలు.. కోర్టు సంచలన తీర్పు..

Spread the love
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు విచారణలో భాగంగా టీవీ యాంకర్‌ ప్రదీప్‌ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. తండ్రితో కలిసి ప్రదీప్‌ ఇవాళ కోర్టుకు వచ్చారు. ప్రదీప్‌ డ్రైవింగ్ లైసెన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఆధారాలతో పాటు ఆధార్ కార్డును పోలీసులు కోర్టుకు సమర్పించారు. డిసెంబర్‌ 31న అర్ధరాత్రి పూట జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 45లో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ప్రదీప్‌ పరిమితికి మించి మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ పోలీసులకు చిక్కారు. బ్రీత్‌ అనలైజర్‌లో సుమారు 178 పాయింట్లు చూపించింది. దీంతో ప్రదీప్ కారును పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
ఈనేపథ్యంలో ఈ నెల 8న గోషామహల్‌లోని ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు కూడా ప్రదీప్‌ హాజరయ్యారు. కౌన్సిలింగ్లో భాగంగా మరోసారి తాగి వాహనం నడపొద్దని ప్రదీప్‌కు పోలీసులు సూచించారు. తాను చేసిన తప్పు మరెవరూ చేయవద్దంటూ ప్రదీప్‌ ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ప్రదీప్ కొర్టుకు రావడంతో పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన త‌రువాత నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడేళ్ల పాటు రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ప్రదీప్‌కు రూ.2100 జరిమానా విధించింది.
Loading...

Leave a Reply

Your email address will not be published.