అతని మరణం తట్టుకోలేక.. కార్తీ ఏం చేశాడో చూడండి..

Spread the love

సినీ తారలన్న తర్వాత అభిమానులు ఉండటం సహజమే. కానీ కొంతమందికి మాత్రం వీరాభిమానులు ఉంటారు. వీరంతా కలిసి అభిమాన సంఘాలు ఏర్పాటు చేసి తమ హీరోల పేరు మీద మంచి కార్యక్రమాలు చేసేందుకు పూనుకుంటారు. అలాంటి అభిమానులను పొందినందుకు నటులు కూడా చాల గర్వపడుతుంటారు. వారితో వ్యక్తిగతంగా పరిచయాలు పెంచుకుంటుంటారు. తమిళనాడులో ఇలాంటి అభిమానులు చాలా మంది ఉంటారు. ప్రముఖ నటుడు కార్తీ పేరు మీద కూడా అక్కడ చాలా అభిమాన సంఘాలు ఉన్నాయి.

అయితే అక్కడి తిరువన్నామలై కార్తీ ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ జీవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన కార్తీ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. తర్వాత ఆ అభిమానికి నివాళులు అర్పిస్తూ ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యాడు. అక్కడున్న వారందరినీ చూసి కన్నీళ్ల పెట్టుకున్నాడు. ఒక హీరో తమ అభిమానులని ఎంతగా ఇష్టపడతాడో కార్తీ ని చూస్తే అర్ధం అయిపోతుంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.