2 కంట్రీస్ పబ్లిక్ టాక్.. పాపం సునీల్ ఇక బయటకు రాడేమో..

Spread the love

ఒక్క ఛాన్స్ లాగా.. హీరో సునీల్ కెరీర్‌కు ఇప్పుడు అర్జెంటుగా ఒక్క హిట్టు కావాలి. ‘హీరో’ చట్రంలో ఇరుక్కుని సునీల్ తప్పు చేశాడన్న విమర్శలకు చెక్ పెట్టడానికైనా ఇప్పుడు సునీల్ కు ఒక హిట్ కావాలి. హీరోగా సునీల్ చేసిన ఒక దశాబ్దపు ప్రయాణంలో.. ‘అందాల రాముడు’, మధ్యలో మర్యాద రామన్న తప్పితే చెప్పుకోవడానికి పెద్ద హిట్స్ లేవు. కెరీర్ గ్రాఫ్ దారుణంగా పడిపోవడంతో సునీల్ పరిస్థితి ఒకరకంగా అగమ్యగోచరంగా తయారైంది. ఇలాంటి తరుణంలో నేడు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన 2కంట్రీస్ సునీల్‌ను కాపాడుతుందా?.. ట్విట్టర్‌లో నెటిజెన్స్ ఏమంటున్నారో తెలుసుకుందాం..

2 కంట్రీస్ చిత్ర దర్శకుడు ఎన్.శంకర్ సినిమా ఫలితంపై ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఓవర్ సీస్‌లో సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుందని, అన్నిచోట్ల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోందని తెలిపారు. సినిమాకు మీ మద్దతు తెలపాలని కూడా ప్రేక్షకులను కోరారు. ఇక సినిమా ప్రారంభంలో సునీల్ పవన్ కల్యాణ్‌ను ఇమిటేట్ చేస్తాడని ఓ నెటిజెన్ అభిప్రాయపడం గమనార్హం. 2కంట్రీస్ సినిమా సునీల్ కు మరో నిరాశనే మిగిల్చిందన్న టాక్ కూడా వినిపిస్తుంది. సినిమాలో ఫస్టాఫ్ బాగాలేదని, సెకండాఫ్ దాని కంటే కాస్త బెటర్‌గా ఉందని చెబుతున్నారు. మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టుకు తగ్గ హీరోను ఎంచుకోవడంలో దర్శకుడు విఫలమయ్యారన్న టాక్ వినిపిస్తుండటం గమనార్హం.

అంత ఖర్చు పెట్టి అమెరికాలో తెరకెక్కించిన సినిమాకు.. అంతే మార్కెట్ స్టాండర్డ్స్ ఉన్న హీరోను తీసుకుని ఉంటే బాగుండేదని అంటున్నారు. విశ్లేషకుల అభిప్రాయలు ఎలా ఉన్నప్పటికీ.. సునీల్ సినిమా బి, సీ సెంటర్లలో మాత్రం వర్కౌట్ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సినిమాలో కామెడీ పెద్దగా పేలలేదని, చాలా సీన్స్ లాజిక్ లేకుండా ఉంటాయన్న టాక్ వినబడుతోంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.