పవన్ నోట.. అజ్ఞాతవాసి పాట.. అదిరిందిపో..

Spread the love

పవన్ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకు ఎంతటి పండుగనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థియేటర్లలో జాతర చేయడానికి యూత్ గ్యాంగ్స్ సిద్దమైపోతారు. తెరపై పవన్ చెప్పే ప్రతీ డైలాగ్ కు.. విజిల్స్.. కేకలు.. హంగామా.. అసలు మొదటి రోజు రచ్చ మామూలుగా ఉండదు. పవన్ సినిమాలో పాటేదైనా పూనకం వచ్చినట్లు స్టెప్పులేసే ఫ్యాన్స్.. ఇక స్వయంగా ఆయనే పాడితే ఇంకెంత రచ్చ చేస్తారో స్పెషల్‌గా చెప్పాలా?.. అజ్ఞాతవాసితో ఇప్పుడు ఆ రచ్చ మరోసారి రిపీట్ కాబోతోంది.

పవన్ స్వయంగా మరోసారి తన గాత్రం సవరించడంతో.. అభిమానులు పండుగ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. తమ్ముడు… జానీ.. అత్తారింటికి దారేది.. కాటమరాయుడు.. ఇలా అడపాదడపా పాటలు కూడా పాడుతూ వస్తున్న పవన్.. అజ్ఞాతవాసిలోను పాట పాడారన్న సంగతి కాస్త ఆలస్యంగానే రివీల్ చేసింది చిత్ర యూనిట్. తాజా సమాచారం ప్రకారం ‘కొడుకా.. కోటేశ్వరరావు..’ అన్న పాటను పవన్ పాడినట్లు తెలుస్తోంది. అజ్ఞాతవాసిలో పవన్ పాట పాడారని తెలియగానే ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

తెరపై ఆయన పాట ఎప్పుడెప్పుడు చూద్దామా?.. ఎప్పుడు స్టెప్పులేద్దామా? అన్న ఉత్సాహంలో ఉన్నారు. పవన్ పాటకు సంబంధించి చిత్ర యూనిట్ కొన్ని ఫోటోలు కూడా విడుదల చేసింది. అజ్ఞాతవాసిలో పవన్ తో పాట పాడించడం కోసం దర్శకుడు త్రివిక్రమ్.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కూడా పాటకు ఓకె చెప్పినట్లు సమాచారం. ఫోటోల్లో పవన్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే మరోసారి పాట ఇరగదీసినట్లే అనిపిస్తోంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.