అజ్ఞాతవాసి.. ప్లాప్ తర్వాత పవన్ చేసిన పని తెలుస్తే ఆయనకు దండం పెడుతారు

Spread the love
కొత్త సంవత్సరంలో రిలీజైన మొదటి భారీ బడ్జెట్ చిత్రం అజ్ఞాతవాసి. అత్తారింటికి దారేది సినిమాతో టాలీవుడ్ కూడా రూ. 100 కోట్ల వసూళ్ల ఫీట్ సాధించగలదని నమ్మకం కలిగించిన హీరో పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టే సినిమా ప్రీ బిజినెస్ కూడా జరిగింది. దాదాపు రూ. 125 కోట్ల మొత్తం ఇండస్ట్రీ ఈ సినిమాపై ఇన్వెస్ట్ చేసింది. ఇన్ని అంచనాల మధ్య వచ్చిన అజ్ఞాతవాసి మొదటి రోజునే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ ట్రెండును బట్టి చూస్తే ఈ సినిమా టార్గెట్ చేరుకోవడం చాలా కష్టం.  మరోవైపు హీరో పవన్ కళ్యాణ్ కానీ.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గానీ ఈ సినిమా ప్రమోషన్ పై అస్సలు దృష్టి పెట్టలేదు. ప్రమోషన్ భారమంతా ఫ్యాన్స్ పై పడేసి సినిమా రిలీజుకు ముందునుంచే సైలెంట్ గా ఉండిపోయారు. తీరా ఇప్పుడేమో సినిమా ఏమో తేడా కొట్టేసింది. కాస్తలో కాస్త మేలు ఏంటంటే ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో వచ్చింది. వీకెండ్ తరవాత మూడు రోజుల పాటు పండగ సెలవులు ఉన్నాయి. సినిమాను టీవీ ప్రింట్ మీడియాల్లో కాస్త ప్రమోట్ చేయడం మొదలు పెడితే పండగ పూర్తయ్యే వరకు కలెక్షన్లు మరీ డ్రాపవకుండా నిలకడగా కొనసాగే అవకాశం ఉంది. అయితే సినిమా రన్ టైంలో ఆడే ప్రసక్తి లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. దాంతో ఈ సినిమా నిర్మాతకు, డిస్టిబ్యూటర్స్ కి నష్టం కలిగే అవకాశం ఉంది. అందుకే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ వారిని ఆదుకోబోతున్నాడట. రెమ్యునరేషన్ గా తీసుకున్న 30 కోట్లు వెనక్కి తీరిగియడమే కాక.. ఇంకా సినిమాకి నష్టం వస్తే పూర్తి బాధ్యత తనే వహిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఏంతైన పవన్ అంతా మంచి మనసు పరిశ్రమలో ఎవరికి ఉండదేమో..!
Loading...

Leave a Reply

Your email address will not be published.