బీఎఫ్‌ సినిమాలో తేజస్వి మదివాడ.. చూస్తే మతిపోవడం ఖాయం..

Spread the love

అందం, అభినయం వర్ధమాన తార తేజస్వి మదివాడ సొంతం. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందనే సామెత విధంగా తేజస్వి కేరీర్ ఎందుకో బ్యాక్ బెంచ్‌లోనే ఉండిపోయింది. బాగా నమ్ముకొని చేసిన సినిమాలు తిరుగు టపా కట్టాయి. బాలీవుడ్‌లో మంచి సక్సెస్ సాధించిన హంటర్ ఆధారంగా రూపొందిన బాబు బాగా బిజీ అనే సినిమా కూడా తేజస్వికి సక్సెస్‌ను ఇవ్వలేకపోయింది. తాజాగా తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు మరాఠీ చిత్రం బాలక్ పాలక్‌ రీమేక్‌లో నటిస్తున్నది. యువ దర్శకుడు శ్రీకాంత్ వెలగలేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బీఎఫ్. తాత్కాలికంగా ఈ సినిమాకు టైటిల్‌ను ఖరారు చేశారు.

మరాఠీలో ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ నిర్మించారు. ఓ వయస్సు ఉండే యువతి, యువకులకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన కలిగించే చిత్రంగా రూపొందించనున్నారు. ఈ చిత్రంలో తేజస్వి కీలకపాత్రను పోషిస్తున్నారు. మరాఠీలో రవి జాదవ్ తీసిన ఈ చిత్రానికి మంచి ప్రశంసలు లభించాయి. అయితే ఈ చిత్రం కొన్నాళ్లు వేగంగా షూటింగ్ జరుపుకొన్నది. కానీ ఇటీవల కాలంలో ఈ సినిమా షూటింగ్ అంతగా ప్రోగ్రెస్ లేదు. ఏం జరుగుతున్నది అనే విషయంపై పెద్దగా సమాచారం లేదు. ఈ ఏడాది చివర్లో విడుదల అవుతుందనుకున్న చిత్రం గురించి పెద్దగా సమాచారం లేకపోవడంతో హీరోయిన్ తేజస్విని మీడియా ఆరా తీసిందట.

ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి ఏం జరుగుతున్నదో నాకు తెలియదు. నిర్మాత, దర్శకుల నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు అని చెప్పింది. బాలక్ పాలక్ అనే మరాఠీ చిత్రంగా రూపొందుతున్న బీఎఫ్ చిత్రంలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ సినిమాలో అద్భుతమైన అంశాలు ఉన్నాయి. ఆ సినిమా పెద్దలకే కాదు.. పిల్లలకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది అని తేజస్వి చెప్పినట్టు మీడియాలో ఓ వార్త వెలుగుచూసింది.

Loading...

Leave a Reply

Your email address will not be published.