అజ్ఞాతవాసి అసలు ఏం సినిమా..? సురేఖ ఇలా అనేసిందేంటి..?

Spread the love
ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న అజ్ఞాతవాసి ఫైనల్ గా అభిమానుల ముందుకు వచ్చింది. మొన్నటి వరకు సినిమా పై ఉన్న అంచనాలు సినిమా మీద కొంచెం ఎఫెక్ట్ చూపించినట్లే కనిపించింది. పవన్ అభిమానుల వరకు సినిమా ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది పండగ తరువాత తెలుస్తుంది. ఇక కలెక్షన్స్ పరంగా చూస్తే సినిమా మంచి వసూళ్లనే రాబడుతుంది అనేది అందరికి తెలిసిన విషయమే. కానీ టాక్ కొంచెం తికమకపెడుతోంది.
ఇక అమెరికా కలెక్షన్స్ లో అయితే పవన్ కళ్యాణ్ తన సత్తాని చాటుకున్నాడు. నాన్ బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు. ప్రీమియర్స్ ద్వారానే డాలర్ల వర్షం కురిపించాడు. మొదట ప్రీమియర్స్ ద్వారా వచ్చిన కలెక్షన్స్ ని చూసుకుంటే..  USD 1.487M రాబట్టింది. బాహుబలి 2 USD 2.450m మొదటి స్థానాన్ని అందుకోకపోయినా పవన్ తన రేంజ్ కి మించిన వసూళ్లను రాబట్టాడు. ఎందుకంటే బాహుబలికి అజ్ఞాతవాసికి చాలా తేడా ఉంది. ఫైనల్ గా ఇప్పుడు అజ్ఞాతవాసి ప్రీమియర్స్ ద్వారా సెకండ్ ప్లేస్ ని అందుకుంది. ఆ తరువాత బాహుబలి 1 అలాగే మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ఉన్నాయి. అయితే ఏది ఏమైన ఇప్పుడు ఈ సినిమాకి తెలుగులో నెగిటివ్ టాక్ వస్తోంది. అనుకున్న రేంజ్ లో సినిమా లేకపోవడంతో రన్ టైంలో ఈ సినిమాకి కలెక్షన్స్ తగ్గే పరిస్థితి కనబడుతుంది.
అయితే తాజాగా ఈ సినిమాని మెగాస్టార్ భార్య చూసారు. సినిమా చూసిన అనంతరం ఆమె మాట్లాడుతూ..” సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటన బాగుంది. పవన్ తన సినిమా సినిమాకి ఓ మెట్టు పైకి ఎదుగుతున్నాడు. అలానే రాజకీయాల్లో కూడా మంచి లీడర్ గా ఎదిగి ప్రజలకు మంచి చేస్తాడనే నమ్మకం మా అందరికి ఉంది అని ఆమె తన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలుస్తోంది.
Loading...

Leave a Reply

Your email address will not be published.