‘జై సింహా’చూసి రాజమౌళి ఇచ్చిన రివ్యూ చూస్తే.. సింహాలు కూడా గర్జింస్తాయి

Spread the love
నందమూరి బాలయ్య మరోసారి గర్జించాడు. ఫస్ట్‌‌లుక్‌లోనే తన పవర్ చూపిన నటసింహం.. టీజర్‌లో ‘సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు.. సైలెంట్‌గా ఉందని కెలికితే తల కొరికేస్తాది’ అంటూ ‘జై సింహా’ మూవీ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశాడు. ఇక ట్రైలర్‌లో తనకు మాత్రమే సాధ్యమైన ఫీట్లు చేస్తూ తనలో తడాఖా ఏమాత్రం తగ్గలేదని రుజువుచేశాడు. 2017లో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో సంక్రాంతి సీజన్‌లో మాటల తూటాలు పేల్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య అదే ఫ్లోను 2018లోనూ కంటిన్యూ చేసేందుకు ‘జై సింహా’ చిత్రంను ఈ రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ‘జై సింహా’కి ఇప్పుడు పాజిటివ్ టాక్ వస్తోంది.
బాలయ్య చెప్పిన డైలాగ్స్ అదిరిపోగా.. సినిమాలో పంచ్ డైలాగులు బాగా పెలాయి.. ఇంద్రుడు చంద్రుడు నీ ముందు జీరో అన్నా.. జనాల్లో నువ్వే నంబర్ వన్. నువ్ రౌడీవి.. మెకానిక్ రౌడీవి.. ఫ్యాక్షనిస్ట్‌వి.. సైకిలిస్ట్‌వి.. లవ్‌లో వేస్ట్‌వి అంటూ శివాజీరాజా డైలాగ్‌లు నవ్వులు పూయిస్తోంది. ఇక ఫారిన్ బైక్‌పై నయన్‌ను వెనుకన కూర్చోబెట్టుకుని లవ్ బ్రేకర్స్ వేసేస్తున్నాడు బాలయ్య. ఇక బాలయ్య-నయన్ మధ్య వచ్చే ఎమోషన్ సీన్లలో ఏడిపించేశాడు బాలయ్య. మౌనంగా మౌనంగా బాధల్ని భరిస్తా…. మూర్ఖంగా ప్రాణాల్ని తీసేస్తా.. అంటూ తన లోని ఉగ్రరూపాన్ని మరోసారి రుచిచూపాడు. నేను నీలా చదువుకోలే.. నా కంతే తెలుసంటూ ‘జై సింహా’ మరోసారి గర్జించాడు. ఇక ఈ సినిమాపై ఎస్ ఎస్ రాజమౌళి స్పందించినట్లు తెలుస్తోంది.
బాలయ్య బాబు అంటే నాకు ముందు నుంచి చాలా ఇష్టం. ఆయన నటించిన ఏ సినిమా అయిన మిస్ చేయకుండా చూస్తుంటా అని అన్నారు. అలానే కొకొకోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ.. ఇంతకు మించి ఇంకేం చెప్పగలం’ అని రాజమౌళి గతంలో బాలయ్యపై ట్వీట్‌ చేశారు. ఇప్పుడు కూడా హై ఎనర్జీ ఉన్న బాలయ్యను దర్శకుడు మనకు సమర్పించారు. బాలయ్యను గత 101 చిత్రాల్లో మనం చూడని విధంగా ‘జై సింహా’ లో చూపించారు అంటూ బాలయ్య పై రాజమౌళి కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.
Loading...

Leave a Reply

Your email address will not be published.