‘MCA’ చూసి రాజమౌళి ఇచ్చిన రివ్యూ.. నాని నువ్వు తోపు..

Spread the love

నేచురల్ స్టార్ నాని, ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ మూవీ ఎంసీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయి. వరుస సక్సెస్‌లో మంచి ఊపుమీద ఉన్న నాని ఈ ఏడాది నేను లోకల్, నిన్నుకోరి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ల తరువాత ‘ఎంసీఏ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న (ఈరోజు) థియేటర్స్‌లో సందడి చేస్తున్నాడు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన మిడిల్ క్లాస్‌ అబ్బాయ్‌ని చూసేందుకు ప్రేక్షకులను ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా టాక్ విషయంకు వస్తే.. సినిమాటోగ్రఫి సమీర్ రెడ్డి సాంగ్స్ లో కొంచెం కొత్త టెక్నిక్ వాడారు.

రాక్ స్టార్ DSP సాంగ్స్ న్యూ ట్యూన్స్ కాకపొఇనా కూడా, వినాలనిపించేట్లు వున్నాయి. సాంగ్స్ టేకింగ్ కూడా బాగా కుదిరింది. ఎడిటర్ ప్రవీణ్ పూడి మూవీ బోర్ కొట్ట కూడా సూపర్బ్ ఎడిటింగ్ చేసాడు. ఈ ఎడిటర్ ఎన్నో మంచి సినిమాలకి ఎడిటింగ్ చేసినా కూడా ( అత్తారింటికి దారేది, జులాయి, మనం) రావల్సినంత పేరు రాలేదు అనిపిస్తుంది. రేపటి హలో మూవీ కూడా ప్రవీణ్ దే. దిల్ రాజు ప్రొడక్షన్ గురించి చెప్పాల్సిన పని లేదు. మూవీ కి ఎక్కడా పైసా ఎక్కువ అని కాని, పైసా తక్కువ అని కాని అనిపించదు. హీరో నాని మూడో హట్రిక్ ఈ సినిమా తో స్టార్ట్ చేసాడు. ఇన్ని వరుస హిట్స్ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఎక్కడా బోర్ కొట్టదు. కొన్ని చోట్ల ఇంకొంచెం బెటర్ గా వుంటే బాగుండేది అనిపిచడం తప్ప.

అయితే ఈ మూవీని రాజమౌళి చూసినట్లు తెలుస్తోంది. సినిమా చూసిన తర్వత.. ” సినిమా చాలా బాగుంది. నాని మిడిల్ క్లాస్ అబ్బాయి గా అద్భుతంగా నటించాడు. ఇక సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిదాతో అందర్ని ఫిదా చేసిన ఈ బ్యూటీ ఈ సినిమాలో కూడా అందర్ని ఫిదా చేసింది. ఇక దిల్ రాజు నిర్మాణం బాగుంది, వేణూ డైరెక్షన్ కూడా బాగుంది. దేవి సంగీతం, ఆయన పాటలు కూడా నాకు నచ్చాయని.. రాజమౌళి తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.