ఫస్ట్ టైం సమంత చేత కన్నీళ్లు పెట్టించిన నాగ్, అమల

Spread the love

ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ స‌మంత అన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఆ త‌రువాత అక్కినేని హీరో నాగ చైత‌న్య‌ను ఏ మాయ చేసిందో తెలీదుకానీ.. బుట్ట‌లో వేసేసుకుంది. వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. వారి కంట‌.. వీరి కంట ప‌డ‌టంతో వారి వ్య‌వ‌హారం కాస్తా ఇరువురి త‌ల్లిదండ్రుల వ‌ద్ద పంచాయితీ పెట్టే వ‌ర‌కు పోయింది. దీంతో చేసేది లేక ఇరువురి త‌ల్లిదండ్రులు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చేశారు. ఇలా నాగ‌చైత‌న్య‌తో పెళ్లి జ‌ర‌గ‌డంతో స‌మంతకు అక్కినేని వారి స్టార్ ఇమేజ్ కూడా తోడైంది.

అయితే, స‌మంత క్రిస్టియ‌న్ అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే. అందులో భాగంగానే ఇటీవ‌ల జ‌రిగిన క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను ఘనంగా జ‌రుపుకునేందుకు స‌మంత ప్లాన్ చేసిందంట‌. ఆ విష‌యం కాస్తా త‌న అత్తా మామకు తెలియ‌డంతో క్రిస్మ‌స్‌ను హైద‌రాబాద్‌లోని త‌మ ఇంట్లోనే ప్లాన్ చేశారంట‌. అయితే, స‌మంత త‌న అత్తారింటి వ‌ద్ద జ‌రుపుకున్న తొలి పండుగ క్రిస్మ‌స్ కావడం గ‌మ‌నార్హం. అక్కినేని కుటుంబం మొత్తం క్రిస్మ‌స్ వేడుక‌లో భాగం కావ‌డంతో స‌మంత ఆనందానికి అవ‌ధులు లేవు.

త‌న ఆనందానికి కార‌ణ‌మైన అత్త‌మామ‌ల‌ను చూసిన స‌మంత కంట ఆనంద భాష్పాలు ధారాళంగా వ‌చ్చాయ‌ట‌. అయితే, ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొని సినీ ఇండ‌స్ర్టీలో అడుగుపెట్టాన‌ని ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో స‌మంత చెప్పిన మాట‌లు విధిత‌మే.

Loading...

Leave a Reply

Your email address will not be published.