మూడో భార్యతో పవన్ విడాకులపై.. రేణు దేశాయ్ ఘాటు వ్యాఖ్యాలు..

Spread the love

జ‌న‌సేన అధినేత‌.. టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్… ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాలతో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. అయితే తాజా సినీ రాజ‌కీయాల‌కు సంబంధం లేని ఒక వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఇప్ప‌టికే త‌న పెళ్లిళ్ళ పై అనేక ర‌చ్చ‌లు జ‌రుగున్న టైమ్‌లో తాజాగా ప‌వ‌న్‌ ఇప్పుడు మ‌రొక కొత్త చిక్కు వ‌చ్చిప‌డింది. ప‌వ‌న్ మూడ‌వ భార్య అన్నా లెజీనోవో విడాకులు ఇచ్చేందుకు సిద్ధ‌మైందంట‌. ఈ న్యూస్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో గిర్రున తిరుగుతోంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. మొద‌ట పెద్దలు నిశ్చయించి పెళ్లి చేసిన నందినిని పలు కారణాల వల్ల దూరం చేసుకున్నాడు.

ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత పవన్‌ సహనటి రేణు దేశాయ్‌తో సహజీవనం చేశాడు. ఒక బాబు పుట్టిన తర్వాత రేణు మెడలో తాళి కట్టాడు. కొన్నాళ్లకే పలు కారణాల వల్ల రేణుకు కూడా విడాకులు ఇచ్చాడు. ప్రస్తుతం మూడో భార్య రష్యాకు చెందిన అన్నాలెజినోవాని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ప్ర‌స్తుతం ఇద్ద‌రు పిల్ల‌లు. దీంతో ప‌వ‌న్ మూడో రిలేష‌న్ అన్నా నిల‌బ‌డింది అనుకునే లోపే మూడో భార్య కూడా పవ‌న్‌కు విడాకులు ఇచ్చే ఆలోచనలో ఉందనే టాక్ బయ‌ట‌కు రావ‌డంతో ఒక్క‌సారిగా సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

అయితే, ఇదే విష‌యంపై ప‌వ‌న్ రెండో భార్య రేణుదేశాయ్ స్పందించింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను రాజ‌కీయంగా ఏమీ చేయ‌లేకే ఇటువంటి గాసిప్స్‌కు తావులేపుతున్నార‌ని ఫైర్ అయింది. అస‌లు అన్నా జెలీనోవాతో ప‌వ‌న్ విడాకులు తీసుకుంటున్నాడ‌ని ఎవ‌రు చెప్పార‌ని ఎద‌రు ప్ర‌శ్నించింది. ఐ డోన్ట్ రియాక్ట్ దిస్ మేట‌ర్ అంటూ రిప్లై ఇచ్చింది. రోజు రోజుకు పెరుగుతున్న ప‌వ‌న్ క్రేజ్‌ను చూసే.. గిట్ట‌ని వారు ఇలా ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై లేని పోని గాసిప్స్ సృష్టిస్తున్నార‌ని చెప్పుకొచ్చింది.

Loading...

Leave a Reply

Your email address will not be published.