పవన్ టార్చర్ తట్టుకోలేక.. రేణు ఎంత పని చేసిందో తెలుసా..?

Spread the love

పవన్ కళ్యాణ్ పేరు వింటేనే ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ వణికిపోతున్నారట. రేణు విడిపోయిన తర్వాత కూడా పవన్ అప్పుడప్పుడు పుణే వెళ్లి కొడుకు అకీరా, కూతురు ఆద్యలతో గడిపి వస్తుంటారు. రేణు కూడా తరచూ ట్వీట్స్ చేస్తూ పీకే పై ప్రేమ పోలేదని చెబుతూనే ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో సమీకరణాలు మారిపోయాయి. రేణు దేశాయ్ కాస్త స్వతంత్రంగా వ్యవహరించడంతో, హక్కు లేకపోయినా పవన్ సాధింపులు ఎక్కువైపోయాయట. ప్రస్తుతం రేణు మాటీవీలో ‘నీతోనే డ్యాన్స్’ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఆ డాన్స్ షోలో ప్రేక్షకుల్ని అలరించడానికి రేణు చేసే కామెంట్స్, చిన్న సెటైర్స్ చాలా పెద్ద వివాదాలుగా మారిపోయాయి. పవన్ ఫ్యాన్స్ ఆమెపై ఎదురుదాడికి దిగుతున్నారు. అంతేకాదు, మరో వివాహం చేసుకోవాలని ఉందని రేణు సరదాగా అన్న మాటని పవన్ ఫ్యాన్స్ చాలా సీరియస్ గా తీసుకుని అల్లరి అల్లరి చేశారు. చావైనా, రేవైనా పవన్ తోనే ఉండాలని హుకుం జారీ చేశారు. ఇదంతా ఒక ఎత్తైతే, పవన్ వేధింపులు మరోవైపు ఆమెను టార్చర్ చేస్తున్నాయట. రేణు దేశాయ్ హైదరాబాద్ లో దిగిన మరుక్షణం, పవన్ నియమించిన బాడీ గార్డులు ఆమె చుట్టూ చేరిపోతారు. అన్నపూర్ణ స్టూడియోలో ఆమె షో జరుగుతున్నంత సేపు, ఆమెకు కాపలాగా అక్కడే ఉంటారు.

పవన్ పర్సనల్ అసిస్టెంట్ ఎప్పటికప్పుడు రేణుని ఎవరు కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో పీకేకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తుంటాడు. అన్నపూర్ణ స్టూడియోలో రేణు భయం భయంగా గడుపుతుంటుంది. ఎవరైనా సరదాగా సెల్ఫీలు దిగుతామని అడిగినా నిరాకరిస్తోందట. మీరు ఫొటోలు దిగి ఫేస్ బుక్ లో పెడతారు. దానికి కళ్యాణ్ తో ట్యాగ్ లు, స్లాష్ లు పెడతారు. నాకు తిట్లు పడతాయి. నో సెల్ఫీస్ ప్లీజ్ అని సున్నితంగా తిరస్కరిస్తోందట రేణు దేశాయ్.

Loading...

Leave a Reply

Your email address will not be published.