హీరోయిన్ తో రానా పెళ్లి ఫిక్స్.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Spread the love
టాలీవుడ్లో.. ఆ మాటకొస్తే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో దగ్గుబాటి రానా ఒకడు. అతనిప్పుడు 34లో ఉన్నాడు. రానా కంటే చిన్న వాడైన అతడి కజిన్ అక్కినేని నాగచైతన్య
పెళ్లి చేసేసుకున్నాడు. అతడి క్లోజ్ ఫ్రెండ్ రామ్ చరణ్ ఐదేళ్ల కిందటే ఓ ఇంటివాడయ్యాడు. ఇంకా టాలీవుడ్లో రానా కంటే చిన్న వాళ్లయిన చాలా మంది హీరోలు పెళ్లిళ్లు చేసేసుకున్నారు. రానా మాత్రం ఆ ఊసే ఎత్తట్లేదు. నటుడిగా రోజు రోజుకూ బిజీ అయిపోతూ అసలు ఇప్పుడిప్పుడే పెళ్లి ఆలోచనే లేనట్లుగా వ్యవహరిస్తున్నాడు రానా. మరి రానా సంగతి సరే.. అతడికి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లకు ఉండదా? మరి ఇంట్లో వాళ్లను రానా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాడన్న సందేహం రావడం సహజం. ఈ సందేహాలకు ఒక ఇంటర్వ్యూలో బదులిచ్చాడు రానా.
తన పెళ్లి గురించి ఇంట్లో వాళ్లకు తాను మాట్లాడే ఛాన్సే ఇవ్వట్లేదని అంటున్నాడు రానా. పెళ్లి గురించి మట్లాడటానికి వాళ్లకు తాను దొరికితే కదా అని అతనన్నాడు. వారంలో మూడు నాలుగు రోజులు తాను అసలు హైదరాబాద్ లోనే ఉండనని.. వేర్వేరు భాషల్లో సినిమాలు చేస్తూ ఎక్కడెక్కికో తిరుగుతూ ఉండటం వల్ల తాను ఇంట్లో ఉండేదే తక్కువ అని.. ఇంట్లో ఉన్నపుడు కూడా చాలా బిజీగా కనిపిస్తుంటానని.. దీంతో ‘‘పాపం వీడు ఇంట్లో ఉండేదే కొంచెం సేపు.. వీడిని పెళ్లి పేరుతో విసిగించడం ఎందుకు’’ అనుకుని ఇంట్లో వాళ్లు తనను వదిలేస్తున్నారని.. అలా తాను సేఫ్ జోన్లో ఉంటున్నానని రానా చెప్పాడు.
అయితే టాలీవుడ్ ఇప్పుడు రానా పెళ్లిపై ఓ రూమర్ వినిపిస్తోంది. రానా త్వరలోనే త్రిషను పెళ్లి చేసుకోబోతున్నాడని.. అందుకే ఇంట్లో వాళ్లు పెళ్లిపై మాట్లాడకుండా తిరుగుతున్నాడని అంటున్నారు. అయితే త్రిష.. రానాకి మంచి ఫ్రెండ్ అన్న విషయం తెలిసిందే. వీరిద్దరు ముద్దులు పెట్టుకున్న ఫోటోస్ కూడా నెట్ లో హల్ చల్ చేశాయి. అయితే త్వరలోనే త్రిషను పెళ్లి చేసుకోవడం కోసమే రానా ఇలా పెళ్లి మాట ఎక్కువ రాకుండా చూసుకుంటున్నాడట. చైతులాగే రానా కూడా త్రిషను లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి.
Loading...

Leave a Reply

Your email address will not be published.