అఖిల్ కి ఫిదా అయ్యా.. ఏం సినిమారా బాబు..

Spread the love

వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌కు పెట్టింది పేరు.. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్‌. ‘ఇష్క్‌’, ‘మ‌నం’, ’24’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత విక్ర‌మ్ రూపొందించిన‌ చిత్రం ‘హ‌లో’. అఖిల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ జంట‌గా న‌టించిన‌ ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మించారు. ట్రైల‌ర్‌ సింపుల్‌గా చూపించేశారు ద‌ర్శ‌కుడు. రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా క‌థ ఏమిటో.. నాగ్ రిలీజ్ కు ముందే చెప్పేశారు. ”చిన్న‌ప్పుడు విడిపోయేట‌ప్పుడు.. హీరోకి హీరోయిన్ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అయితే 15 ఏళ్ల పాటు.. హీరో ఎన్ని సార్లు  ఫోన్ చేసినా స్పందించ‌దు. ఎప్పుడు తను ‘హ‌లో’ అంటుందా అని హీరో వేచిచూస్తుంటాడు. అదే ఈ సినిమా క‌థ” అని. నాగ్ చెప్పిన క‌థ సింపుల్‌గా ఉన్నా.. విక్ర‌మ్ దానిని డిఫ‌రెంట్‌గానే తెర‌కెక్కించాడని తెలిపారు.

ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ కు ముందే మెగాస్టార్ చిరంజీవి చూశారు. ‘హలో’తో అఖిల్‌ నటుడిగా మరో మెట్టు ఎదిగిపోయాడనడంలో సందేహం లేదు. నటన, డ్యాన్సుతో పాటు పాట పాడిన అఖిల్‌ తన తాత, నాన్న, అన్నకంటే ఓ మెట్టు పైకి ఎదిగాడని చిరు అన్నారు. ఇక ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమాని రామ్ చరణ్ చూసినట్లు తెలుస్తోంది. సినిమా చూసిన అనంతరం ఆయన తన సన్నితులతో మాట్లాడుతూ.. సినిమాలో అఖిల్ అదరగొట్టాడు. మొదటి సినిమాతో చూస్తే.. ఈ సినిమాలో అఖిల్ నటన చాలా బాగుంది. ఇక డ్యాన్స్ లు అయితే ఇరగదీశాడు. ఇక హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో క్యూట్ గా నటించింది. ఆమె తొందర్లోనే స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం. ఇక డైరెక్టర్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆయన డైరెక్షన్ లో చేయాలి అనిపించింది. అంత బాగా ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇక మ్యూజిక్ బాగుందని రామ్ చరణ్ అన్నారట.

Loading...

Leave a Reply

Your email address will not be published.