పవన్ కాల్.. కన్నీళ్ళు పెట్టుకున్న అలీ.. కారణం ఇదే

Spread the love

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సినీ ఇండస్ట్రీలో ఉండే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో అందరికి తెలుసు. దర్శకుడు త్రివిక్రమ్ తో ఆయకున్న సాన్నిహిత్యాన్ని గురించి వివరించక్కర్లేదు. ఇక కమెడియన్ అలీతో సరదా స్నేహాన్ని వర్ణించక్కర్లేదు. ఇది అందరికి తెలిసిన సత్యం. అయితే సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఎక్కువ రోజులు కలిసి ఉండి సడన్ గా కాస్త దూరంగా ఉంటే చాలు రూమర్స్ ఏ స్థాయిలో వస్తాయో ఊహించవచ్చు.

ఇప్పుడు అదే తరహాలో అలీ – పవన్ గురించి ఒక ఊహించని న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. వారిద్దరు విడిపోయారని సోషల్ మీడియాలో అనేక వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి. ఎందుకంటే పవన్ ప్రతి సినిమాలో ఆలీ ఉంటాడు. ఆలీ లేకుండా తన సినిమాలు ఉండవని అతను గుండెకాయ అని చాలా సార్లు పవన్ చెప్పాడు. అయితే ఇప్పుడు అజ్ఞాతవాసి సినిమాలో ఆలీ నటించకపోవడంతో వారిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని న్యూస్ లు వచ్చాయి. కానీ ఫైనల్ గా అందుకు సంబందించిన రీసెర్చ్ చేయగా ఆన్సర్ దొరికింది. ఆలీ పవన్ సన్నిహితులు ఆ న్యూస్ అబద్దమని కొట్టిపారేశారు. కేవలం సినిమాలో ఆలీకి తగ్గ పాత్ర లేకపోవడంతోనే ఆయనను సెలెక్ట్ చేసుకోలేదని నిజం తెలిసిందే. దీంతి అనుమానాలకు రూమర్స్ కి తెర దించినట్లు అయ్యింది. అయితే తాజాగా ఈ విషయంపై ఆలీ చాలా బాధపడినట్లు తెలుస్తోంది.

పవన్ తనకు ఎంత క్లోజో అందరికి తెలిసిందే.. కానీ పవన్ తో తన ఫ్రెండ్ షిప్ కట్ అయిందని వార్తలు రావడం చాలా బాదకరం అని ఆలీ కన్నీళ్లు పెట్టుకున్నాడట. అయితే తాజాగా పవన్.. ఆలీకి కాల్ చేసి.. నువ్వు ఏం బాదపడకు.. మనిద్దరి మద్య ఉన్న స్నేహం ఏంటో నాకు తెలుసు.. అలాంటి రూమర్స్ కి నువ్వు బాధపడొద్దు అని చెప్పాడట. ఇక అజ్ఞాతవాసి సినిమా ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. నెక్స్ట్ వీక్ లో అన్ని పనులు పూర్తవుతాయి. ఇక సినిమా 2018 జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.