తప్పు చేశావ్ సుమ.. వార్నింగ్ ఇచ్చిన పవన్..

Spread the love

త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ కాంబినేషన్ లో మనముందుకు రాబోతున్న సినిమా “అజ్ణాతవాసి”. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ఎంత ఘనంగా జరిగింది. ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఏస్థాయిలో హంగామా చేశారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ తిరుగులేని స్పీచ్, పవన్ కళ్యాణ్ ప్రసంగం, నటీనట్లు పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన విశేషాలు అబ్బో ఇలా చాలా అద్భుతంగా జరిగింది వేడుక. అయితే ఈ వేడుకకు వ్యాఖ్య‌త‌గా ప్ర‌ముఖ యాంక‌ర్ సుమ వ్య‌వ‌హారించిన విషయం తెలిసిందే.

అయితే సుమ చేసిన ఈ పని వల్ల ఆడియో లాంచ్ నిర్వాహ‌కుల‌కు రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల న‌ష్టం జరిగినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ ఆడియోలో ఎన్నో పెర్ఫార్మెన్స్ లు ప్లాన్ చేశారంట నిర్వాహకులు. అయితే యాంకర్ సుమ షెడ్యూల్ ఆరు గంటలకల్లా ఆడియో లాంచ్ రావాల్సి ఉండే.. కానీ ఆమె ట్రాఫిక్ కారణంగా ఆమె 7 గంటలకు వచ్చింది. ఇక ఆడియో స్టార్ట్ అయ్యేసరికి 7.30 అయ్యింది. దాంతో ఆడియో నిర్వాహకులు ప్లాన్ చేసిన పెర్ఫార్మెన్స్ లు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

సుమ లేటుగా రావడం వల్ల ఆడియో లాంచ్ నిర్వాహ‌కుల‌కు దాదాపు 2 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందట. దీంతో సుమపై వారు సీరియస్ అయ్యారట. విషయం పవన్ వరకు వెళ్ళడంతో.. సుమని పిలిచి.. మరోసారి ఇలా చేయకు.. హైదరబాద్ అంటే ట్రాపిక్ అన్న విషయం తెలిసిందే.. ఇకపై కాస్తా ముందు జాగ్రత్తగా చూసుకోమని.. చెప్పారట. అలానే ఆడియో నిర్వాహకులకు కూడా సుమ తప్పు ఏం లేదు.. ట్రాఫిక్ జామ్ అయితే ఆమె మాత్రం ఏం చేస్తుందని చెప్పి.. జరిగిన నష్టంకు పవన్ డబ్బులు ఇచ్చాడట.

Loading...

Leave a Reply

Your email address will not be published.