కత్తి మహేష్ కి అడ్డంగా నేను ఉంటా.. అభిమానులు దయచేసి అపండి – పవన్ కళ్యాణ్

Spread the love
జనసేన అధినేత, పాపులర్ హీరో పవన్ కళ్యాణ్‌పై కొంతకాలంగా విమర్శలు చేస్తూ ఆయన అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై దాడి జరిగింది. గురువారం రాత్రి కారులో వెళ్తున్న కత్తి మహేష్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఓ టీవీ ఛానెల్‌లో నిర్వహించిన చర్చ కార్యక్రమంలో పాల్గొని కారులో తిరిగి వెళ్తుండగా.. కొండపూర్ సమీపంలో ఈ దాడి చోటుచేసుకుంది. వారెవరో తనకు తెలీదని, వారిని స్పష్టంగా కూడా చూడలేదని కత్తి మహేష్ అన్నారు. తాను కారులో కూర్చొని మొబైల్ చూసుకుంటుండగా తన కుడివైపు నుంచి కోడిగుడ్లతో దాడి చేశారని చెప్పారు.
కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా కత్తి మహేష్‌‌ను పవన్ అభిమానులు తీవ్ర పదజాలంతో దూషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన్ని కొడతామని, చంపేస్తామని ఫోన్ చేసి బెదిరించినట్లు కూడా మహేష్ చాలా సార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా కోడిగుడ్ల దాడి వారే చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మరోవైపు కత్తి మహేష్‌పై దాడిని ఓయూ విద్యార్థి జేఏసీ కండించింది. శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా పవన్ దిష్టిబొమ్మలు తగలబెట్టాలని ఓయూ విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు రవి మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో దాడులు చేయడమనేది అనాగరికమని మండిపడ్డారు. ఈ దాడిని తాము ఖండిస్తున్నామన్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించినట్లు తెలుస్తోంది. విషయం చాలా వరకు వెళ్లింది.. అభిమానులు కొంచెం ఓపిక గా ఉండాలి. అతనిపై దాడి చేయడం వల్ల వచ్చేది ఏం లేదు.. ఈ విషయంలో కత్తి మహేష్ తో నేను ఫోన్ లో మాట్లాడుతాను.. అతని సమస్య ఏంటో తెలుసుకుంటాను.. అనోసరంగా అభిమానులు అతని తిట్టడం కానీ.. అతనిపై దాడి చేయడం కానీ చేయోద్దు అని అభిమానులకు పవన్ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.
Loading...

Leave a Reply

Your email address will not be published.