ముందుగానే రామ్ చరణ్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Spread the love

మెగా హీరోల మ‌ధ్య ఇప్పుడు బంధం బాగా బ‌ల‌ప‌డిపోయింది. ముఖ్యంగా చిరంజీవి, ప‌వ‌న్ మ‌ధ్య అయితే అది మ‌రీ ఫెవికాల్ లా అతుక్కుంది. ఈ ఇద్ద‌రు ఇప్పుడు ఆనాటి హృద‌యాల అంటూ పాటలు కూడా పాడేసుకుంటున్నారు. ఈ మ‌ధ్య అన్న‌య్య గురించి ఎక్క‌డ బ‌డితే అక్క‌డ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్. అన్న‌య్య‌తోనే అంత‌గా బాండింగ్ ఉన్న‌పుడు.. అబ్బాయితో మాత్రం ఉండ‌దా..? పైగా చ‌ర‌ణ్ కూడా ఎక్క‌డ క‌నిపించినా ప‌వ‌న్ ను అప్యాయంగా బాబాయ్ అంటాడు. ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా అంటాడు. అలాంటి బాబాయ్ నే తోడు పెట్టుకుని వ‌స్తున్నాడిప్పుడు చ‌ర‌ణ్.

అవును.. రంగ‌స్థ‌లం టీజ‌ర్ సంక్రాంతికి విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది. సినిమా మార్చ్ 30న విడుద‌ల కానుంది. పండ‌క్కి మాత్రం టీజ‌ర్ విడుద‌ల ప్లాన్ చేస్తున్నారు. అజ్ఞాత‌వాసి సినిమాతో పాటే రంగ‌స్థ‌లం టీజ‌ర్ కూడా విడుద‌ల చేయ‌బోతున్నారు. ప‌వ‌న్ సినిమా ఉన్న అన్ని థియేట‌ర్స్ లో అబ్బాయి కూడా సంద‌డి చేయ‌బోతున్నాడు. అలా చేస్తే రంగ‌స్థ‌లంపై అంచ‌నాలు ఇంకా పెరుగుతాయ‌ని ఆశిస్తుంది చిత్ర‌యూనిట్. అయితే తాజా రంగ‌స్థ‌లం టీజర్ ను పవన్ చూసాడట. చాలా బాగుంది.. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని చరణ్ కి ఫోన్ చేసి చెప్పాడని తెలుస్తోంది.  మ‌రి బాబాయ్ అబ్బాయి క‌లిసి ఏం మ్యాజిక్ చేయ‌బోతున్నారో చూడాలిక‌..!

Loading...

Leave a Reply

Your email address will not be published.