వరుణ్ తేజ్ బర్త్ డే కి పవన్ ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..?

Spread the love
మెగా కాంపౌండ్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్ తేజ్. ఈ రోజు పుట్టిన రోజు చేసుకుంటున్న వరుణ్ కు మరో మెగా హీరో ఓ సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. వరుణ్ తేజ్ కు బర్తడే విషస్ చెబుతూ హీరో సాయి ధరమ్ రెండు రేర్ ఫోటోలతో ట్వీట్ చేశాడు. ఒక ఫోటోలో తేజు, వరుణ్ థియేటర్‌లో మూవీ చూస్తున్నట్టుగా, ఇంకోటి మరో సందర్భంటో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో. ‘విష్ యు ఏ వెరీ హ్యాపీ బర్త్ డే రా వరుణ్. లవ్ యు సక్సెస్‌ఫుల్ ఇయర్ ఎహెడ్’ అంటూ సాయి ధరమ్ ట్వీట్ చేశాడు.
తేజు పోస్ట్ చేసిన ఫోటోలలో మూవీ చూస్తున్న వరుణ్ చాలా బొద్దుగా ఉన్నాడు. మరో ఫోటోలో చాలా సన్నగా కనిపిస్తున్నాడు. ఈ రెండు ఫోటోలను పోస్ట్ చేసిన తేజు ‘వాట్ ఏ ఛేంజ్ ఓవర్’ మామా అంటూ ట్వీట్ చేశాడు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా వరుణ్‌కి బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేసింది. ‘హ్యాపీ బర్త్ డే టు యూ వరుణ్, ఈ ఇయర్ బ్లాక్ బస్టర్‌గా ఉంటుంది. నీకు చాలా హ్యాపీనెస్, సక్సెస్ ఉంటుంది. కీప్ షైనింగ్’ అంటూ రకుల్ ట్వీట్ చేసింది. అయితే వరుణ్ కి పవన్ కూడా ఫోన్ చేసి బర్త్ డే విషెస్ చెప్పాడట.
అంతేకాకుండా వరుణ్ కి ఫారన్ నుంచి తెప్పించిన ఓ స్పెషల్ వాచీని గిఫ్ట్ గా కూడా పంపించాడట. బాబాయి ఇచ్చిన గిఫ్ట్ చూసి వరుణ్ చాలా సంతోషపడ్డాడట. ఇక వరుణ్ ప్రస్తుతం  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై నిర్మితమవుతున్న చిత్రం ‘తొలిప్రేమ’ సినిమాలో నటిస్తున్నాడు. రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. యువ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు.
Loading...

Leave a Reply

Your email address will not be published.