మూడో భార్యతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Spread the love

పవన్ కళ్యాణ్ తన రెండో భార్య రేణు దేశాయ్ తో విడిపోయిన తర్వాత అన్నా లేజినోవాని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటివలే వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. ఇక పవన్ తన సినిమాలు చేసుకుంటూ.. రాజకీయాలతో బీజిగా ఉన్నాడు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. అన్నాలేజినోవా.. పవన్ తో విడిపోవడానికి రెడీగా ఉందని.. వార్తలు వచ్చాయి. ఎక్క‌డ అన్యాయం జ‌రిగినా.. నేనున్నానంటూ స్పందించే ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. చాలా మందికి ఆర్థిక‌సాయం చేశాడ‌ని చెప్ప‌వ‌చ్చు.

అందులో క్యాన్స‌ర్ బాధితుల సంఖ్య ఎక్కువే. అయితే, ఇటీవ‌ల కాలంలో ఓ నిరుపేద కుటుంబం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిసి త‌మ‌కు సాయం చేయాల‌ని అడుగ‌గా.. వారిని చూసి చ‌లించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ బాగానే ఆర్థిక‌సాయం చేశాడు. ఇవ‌న్నీ క‌ళ్లారా చూసిన ప‌వ‌న్ క‌ల్య‌ణ్ భార్య‌.. మీలో సేవా గుణం ఉండొచ్చుకానీ.. మ‌రీ ఇంత‌లా కాదండీ.. దానాలు చేసేందుకు వాగానే ఉన్నా.. తీరా అవి మ‌న‌ల్నే రోడ్డుపైకి ఈడుస్తాయని, దానాలు త‌గ్గిస్తే మంచిదంటూ ప‌వ‌న్‌కు స‌ల‌హా ఇచ్చిందంట‌.

నేనింతే.. సేవ‌లు, దానాలు చేస్తూనే ఉంటా.. అంటూ అన్నా లెజీనోవోతో ప‌వ‌న్ అన్నాడ‌ని వారం క్రితం సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేసింది. అయితే తాజాగా ఈ వార్తలన్ని ఒట్టి పుకార్లే అని పవన్ కొట్టి పడేశారు. ఇలాంటి వార్తలను తాను పట్టించుకోనని.. తన భార్యతో సంతోషంగా ఉన్నానని పవన్ తెలిపినట్లు తెలుస్తోంది. ఇలాంటి రూమర్స్ నమ్మోద్దు అని పవన్ అన్నాడట.

Loading...

Leave a Reply

Your email address will not be published.