అజ్ఞాతవాసి ఫ్లాప్ అయిందని.. ఫ్రెండ్స్ కి రాత్రి పార్టీ ఇచ్చిన మెగా హీరో ఎవరో తెలుసా..?

Spread the love
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన అజ్ఞాతవాసి సినిమా మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పవన్ ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ అంటుండడగా.. సినిమా క్రిటిక్స్, సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమా తేలిపోయిందని విమర్శిస్తున్నారు. ఫేస్ బుక్, వాట్సప్ లలో సినిమా ఎలా ఉందనే విషయం వైరల్ గా స్పెడ్ అవుతుండడంతో సినిమాపై నెగెటివ్ ఇంపాక్ట్ వేగంగా వ్యాపిస్తోంది.. ఇక అజ్ఞాతవాసి సినిమా చూసి తెలుగు సినిమా పెద్దలు కూడా పెదవి విరుస్తుండడంతో ఓ మెగా హీరో పండుగ చేసుకోవడానికి రెడీ అయ్యాడు. సదురు మెగా హీరో ఈ మధ్య పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.. పవన్ కళ్యాణ్ ఏ ఫంక్షన్లకు రాడని.. ఆయన ఫ్యాన్స్ మాత్రం వచ్చి మెగా హీరోల ఫంక్షన్లను డిస్ట్రబ్ చేస్తుంటారని విమర్శించిన సంగతి తెలిసిందే.. పవన్ గురించి చెప్పను అంటే చెప్పను అంటూ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే..
పవన్ పై వ్యతిరేకంగా మాట్లాడిన సదురు హీరో నటించిన మూవీని పవన్ ఫ్యాన్స్ పనిగట్టుకొని యూట్యూబ్ లో డిస్ లైక్ లు కొట్టిన విషయం విధితమే.. పవన్ తో .. పవన్ ఫ్యాన్స్ తో వైరాన్ని పెంచుకున్న సదురు మెగా హీరో.. అజ్ఞాతవాసి మూవీకి నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ అందరితో ఈ విషయాన్ని పంచుకొని పవన్ ఫ్లాప్ ను పండుగ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడట.. ఈ మేరకు సన్నిహిత మిత్రులందరినీ తన గెస్ట్ హౌస్ కు రమ్మన్నాడట.. అందరం కలిసి పవన్ పరాజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పాడట.. ఈ దెబ్బకు అయినా పవన్ దిగివస్తే చాలు అంటూ సెటైర్ వేశాడట.. ఏదీ ఏమైనా సాటి మెగా హీరో ఫ్లాప్ ను మరో మెగా హీరో సెలబ్రేట్ చేసుకోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Loading...

Leave a Reply

Your email address will not be published.