పవన్ కళ్యాణ్ ను తిట్టిన వాళ్లకు మూడింది..వెయిట్ చేయండి.. కౌంటర్ వేసిన నితిన్..

Spread the love
యంగ్ హీరో నితిన్ పవన్ కళ్యాణ్ కు ఎంత వీరాభిమానో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అసలు తాను సినిమాల్లోకి వచ్చిందో పవన్ ను చూసి అని చెప్పే నితిన్, ఆయనంటే ప్రాణమిచ్చేసే రకం అభిమాని. మరి పవన్ కళ్యాణ్ ను తిడితే అలాంటోడు ఊరుకుంటాడా..? గత రెండు రోజులుగా పవర్ స్టార్ పై జరుగుతున్న అభియోగాల పర్వంపై తన ట్విట్టర్లో ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చాడు నితిన్. ఏప్రిల్ 17 ఉదయం 11 గంటలకు నితిన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.
న్యూటన్ మూడో సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ, ఏ చర్యకైనా తప్పనిసరిగా ప్రతిచర్య ఉంటుందని, అందుకోసం వెయిట్ చేయాలని హెచ్చరించాడు. త్వరలో ఆ ప్రతిచర్య రాబోతోందని, వెయిట్ చేయండి అని ట్వీట్ చేశాడు. గత రెండు రోజులుగా టాలీవుడ్ లోని మహిళా నటులు పవన్ పై అనేక ఆరోపణలు చేస్తుండగా, పవన్ ఫ్యాన్స్ వాళ్లకు కౌంటర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నితిన్ ట్వీట్ వెనుక అర్ధమేంటా అని అందరూ తలబద్ధలు కొట్టుకుంటున్నారు. మరి ఆ ప్రతిచర్య ఏంటన్నది చూడాలి.
Loading...

Leave a Reply

Your email address will not be published.