కత్తి మహేష్ కి కాల్ చేసిన నాగార్జున.. ఎందుకో తెలుసా..?

Spread the love

కత్తి మహేష్ రివ్యూలకి ఇప్పుడు డిమాండ్ బాగానే పెరిగింది. ఏదైనా సినిమా రిలీజ్ అయితే.. దానికి కత్తి ఎలాంటి రివ్యూ ఇచ్చాడని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. అఫ్‌కోర్స్.. ఆయన రివ్యూలు కాస్త సంతృప్తికరంగా ఉండడం కూడా ఒక కారణం ఉందిలెండి. సరే.. విషయానికొస్తే కత్తి తాజాగా ‘హలో’ మూవీకి రివ్యూ ఇచ్చాడు. రివ్యూవర్లు ప్రోత్సాహకరంగా రివ్యూలు, చూసిన ప్రేక్షకులు పాజిటివ్‌గా స్పందించగా.. కత్తి ఎలా రియాక్ట్ అయ్యాడో మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం పదండి! అఖిల్ తొలిచిత్రం తీవ్రంగా నిరాశపరచగా.. ఆ ఆశల్ని ‘హలో’ మూవీ నిజం చేసిందని కత్తి మహేష్ అన్నాడు.

‘మనసంతా నువ్వే’ తరహా ప్రేమకథకు కాస్త యాక్షన్‌తోపాటు భావోద్వేగాలను మిళితం చేసి.. ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమాని దర్శకుడు విక్రమ్ కె.కుమార్ చాలా బాగా తీర్చిదిద్దారని ఆయన చెప్పాడు. ప్రేమకథలకు ప్రేమ జంట జోడీనే ప్రధానమని.. అఖిల్, కల్యాణి జంట చూడచక్కగా ఉందని.. రమ్యకృష్ణ, జగపతిబాబుల నటన కూడా ఈ మూవీకి కలిసొచ్చిందని ఆయన తెలిపారు. సినిమాటోగ్రఫీకి కూడా మంచి మార్కులు వేయొచ్చన తన అభిప్రాయం తెలిపాడు.

మొత్తంగా.. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ అందమైన అనుభూతి కలిగించడం ఖాయమని కత్తి తన రివ్యూ ఇచ్చాడు. అయితే హలో కి పాజిటి రివ్యూ ఇచ్చినందుకు కత్తికి నాగార్జున కాల్ చేసి థ్యాంక్స్ చెప్పాడట. హలో సినిమా మంచి సినిమా గా గుర్తించి ప్రమోట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల నుంచి గుస గుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైన ఫస్ట్ టైం ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ లేకుండా కత్తి పాజిటివ్ గా హలో మూవీకి రివ్యూ ఇచ్చాడు.

Loading...

Leave a Reply

Your email address will not be published.