హలో హిట్.. అఖిల్ కి రెండు కోట్లు పెట్టి నాగ్ ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..?

Spread the love

‘హలో’సినిమాకు నాగార్జునే ప్రొడ్యూసర్ అని వేరే చెప్పనక్కర్లేదు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొంది, ఈ సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషనల్ యాక్టివిటీస్ లో నిర్మాత, కమ్ అఖిల్ తండ్రి హోదాలో నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంలో కొన్ని టీవీ చానళ్లకు స్పేషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. నిర్మాతగా అఖిల్ కు మీరు ఎంత పారితోషకం ఇచ్చారు? అని నాగార్జునకు ఒక ప్రశ్న ఎదురైంది. భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందించారు కదా, హీరో రెమ్యూనరేషన్ మాటేంటన్న సరదా ప్రశ్నకు..అంతే సరదాగా బదులిచ్చాడు నాగార్జున.

‘హలో’లో హీరోగా నటించినందుకు గానూ అఖిల్ కు రూపాయి కూడా పారితోషకం ఇవ్వలేదట నాగ్! అఖిల్ తో సినిమా నిర్మించాను.. ఇక డబ్బులు కూడా ఇవ్వాలా.. అయిన నా దగ్గర డబ్బు ఉంటే.. వాడి దగ్గర ఉన్నట్లే కదా అని సరదగా అన్నాడు. కానీ అఖిల్ కి ఓ మంచి ఆఫర్ ఇచ్చాడు నాగ్. ఈ సినిమా హిట్ అయితే.. అఖిల్ కు మంచి గిఫ్ట్ ఇస్తానని ప్రామిస్ చేశాడట నాగ్. ఆ గిఫ్ట్ ఏమిటో, దాని విలువ ఎంతో కూడా నాగ్ చెప్పాడు. ‘హలో హిట్ అయితే.. రెండు కోట్ల రూపాయలు పెట్టి.. అఖిల్ కు గిఫ్ట్ కొనిస్తా, అది ఇంపోర్టెడ్ కార్..’ అని నాగ్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. రెండో సినిమాలో నటిచేస్తున్న కుర్రాడికి ఇది భారీ పారితోషకమే అని వేరే చెప్పనక్కర్లేదు.

అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో అఖిల్ కి మంచి హిట్ సినిమా వచ్చినట్లు అయింది. నాగ్ చెప్పినట్లే ఇప్పుడు ఈ సినిమాకి బాగా క్రేజ్ ఏర్పడింది. చూసిన ప్రతి ఒక్కరు సినిమా సూపర్ హిట్ అని తెల్చేశారు. ఇక సినిమా హిట్ కావడంతో నాగ్ అన్నట్లుగానే అఖిల్ కి రెండు కోట్ల రూపాయలు పెట్టి ఇంపోర్టెడ్ కార్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాలనుంచి గుస గుసలు వినిపిస్తున్నాయి.

Loading...

Leave a Reply

Your email address will not be published.