ఇది కూడా ఒక సినిమానేనా.. గతిలేక తీసినట్లుంది..

Spread the love
నందమూరి బాలకృష్ణకు మాస్‌లో ఫాలోయింగ్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పనవసరంలేదు. ఇలాంటి మాస్ హీరోకి మంచి కమర్షియల్ దర్శకుడు తోడైతే.. ఆ కాంబినేషన్ అదిరిపోతుంది. ఈ సంక్రాంతికి అలాంటి కాంబినేషనే సందడి చేస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్, బాలయ్య కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘జైసింహా’. బాలయ్య అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ సినిమా నేడు (జనవరి 12న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్‌లో ఇప్పటికే సినిమా ప్రదర్శితమైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీమియర్ షోలు పడిపోయాయి. సినిమా చూసినవారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. సినిమా ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ అయితే దాన్ని మించి ఉందని ట్వీట్లు చేస్తున్నారు. సెకండ్ హాఫ్‌లో సెంటిమెంట్, భావోద్వేగాలు బాగా పండాయని, మొత్తంగా ఇది మంచి మూవీ అని మరొకరు ట్వీట్ చేశారు.
సెకండాఫ్‌లో రెండు ఎపిసోడ్‌లు అద్భుతంగా ఉన్నాయట. అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ అని అంటున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయిందని, తొలి భాగంలో ‘అమ్మకుట్టి’ పాట, బ్రాహ్మణుల సన్నివేశం హైలైట్ అని మరొకరు ట్వీట్ చేశారు. మొత్తానికి సోషల్ మీడియా టాక్‌ను బట్టి చూస్తుంటే ఈ సంక్రాంతికి బాలయ్య హిట్టు కొట్టినట్లే కనిపిస్తోంది. కానీ ఈ సినిమాపై కత్తి మహేష్ ఇచ్చిన రివ్యూ మరోలా ఉంది.. సినిమా చూసిన తర్వాత ఆయన.. ” 80ల కథకి, 90ల కథనం. గతిలేని కథ. గమనం లేని కథనం. వెరసి ఒక కలగురగంప సినిమా “జై సింహ”. నిరర్ధకమైన కథలోని అసంబద్ధమైన పాత్రలో బాలయ్య. ఎందుకు ఉన్నామో తెలీని హీరోయిన్లు ముగ్గురు. అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా!.. అంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో ట్విట్ చేశారు.
Loading...

Leave a Reply

Your email address will not be published.