‘అజ్ఞాతవాసి’ చెత్త సినిమా.. ఎందుకయ్య నీకు సినిమాలు..?

Spread the love

‘బిగ్‌బాస్’ షో నుంచి బయటికొచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో ఆయన సరసాలు కొన్నిరోజుల వరకే ఉంటుందనుకుంటే.. డైలీ సీరియల్‌లా సాగదీస్తూనే ఉన్నాడు. నిత్యం వార్తల్లో నిలిచేందుకు ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూనే వస్తున్నాడు. నిన్నటివరకు పవన్ ప్రసంగాలపై సెటైర్లు వేసిన కత్తి.. ఇప్పుడు ఆయన లేటెస్ట్ ఫిల్మ్ ‘అజ్ఞాతవాసి’ని టార్గెట్ చేశాడు. నేరుగా చెప్పలేదు కానీ.. ఓ హాలీవుడ్ సినిమా ట్రైలర్‌ని సాక్ష్యంగా చూపిస్తూ ‘అజ్ఞాతవాసి’ దానికి కాపీ చిత్రమంటూ ఆరోపణ చేశాడు. కత్తి మహేష్ మాత్రం ఇండైరెక్ట్‌గా ‘అజ్ఞాతవాసి’ ఓ కాపీ చిత్రమంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, అతని పైశాచికానందానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే తాజా ఈ సినిమా ఆడియో వేడుక జరిగిన విషయం తెలిసిందే.

ఈ ఆడియో వేడుకపై కూడా మహేష్ తన కత్తిని దింపాడు. అయితే మాములుగా కత్తి మహేష్ అంటే సినిమాల గురించి మాత్రమే మాట్లాడుతాడు, రివ్యూలు చెప్తాడని అందరు అనుకుంటూ ఉంటారు. కానీ సినిమాలతో పాటు రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటాడు. అయితే ఈ సినిమా ఆడియో వేడుక ఎందుకు చేశారో పవన్ కళ్యాణ్ కే తెలియాలి..

ఆడియో వేడుకలో పవన్ మాట్లాడిన మాటలు కూడా అభిమానులు ఇంకా రెచ్చిపోయేలా ఉన్నాయి. తన రాజకీయాల కోసం ఈ ఆడియో వేడుకను ఉపయోగించుకున్నాడు. పవన్ ఇచ్చే ప్రతి స్పీచ్ వెనకల త్రివిక్రమ్ ఉంటాడు.. కానీ తన పరువు పోతుందని.. తనకు త్రివిక్రమ్ కు ఏం సంబంధం లేదని.. తాను లేకున్న త్రివిక్రమ్ సినిమాలు చేసుకోగలడు అని కామెంట్ చేసి తప్పించుకున్నాడని పవన్ పై కత్తి కామెంట్స్ చేశాడు. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం కత్తిపై ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే పవన్ తిట్టి తప్పు చేశావ్.. నీ రివ్యూస్ నువ్వు చెప్పుకో అంతేకానీ.. అనోసరంగా ఇలాంటి విషయాల్లోకి రావద్దు అని కత్తికి పవన్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.