MCA సినిమానేనా.. ఎందుకు తీస్తారో.. కసా కసా నరికిన కత్తి రివ్యూ

Spread the love

మిడిల్ క్లాస్ అంటేనే చాలా మందికి క‌నెక్ట్ అయ్యే విష‌యం. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని సినిమాలు వ‌చ్చినా కూడా పూర్తిగా మిడిల్ క్లాస్ మెంటాలిటీని మాత్రం చూపించ‌లేదు ద‌ర్శ‌కులు. ఒక‌వేళ హీరో మిడిల్ క్లాస్ అయినా కూడా డ్యూప్లెక్స్ హౌజ్ లో ఉంటాడు. కానీ ఇప్పుడు నాని న‌టించిన ఎంసిఏ మాత్రం ప‌క్కా మిడిల్ క్లాస్ అబ్బాయి క‌థే. తెర‌పై మ‌న‌ని మ‌నం చూసుకున్న‌ట్లు అనిపిస్తుంది ఈ క‌థ‌. ట్రైల‌ర్ చూస్తుంటేనే ఈ విష‌యం అర్థ‌మైపో తుంది. ఇక ఇప్పుడు సినిమా వ‌చ్చేసింది. డిసెంబ‌ర్ 21న దాదాపు 800 థియేట‌ర్స్ లో విడుద‌లైంది ఎంసిఏ. నాని కెరీర్ లోనే ఇది హైయ్య‌స్ట్ రిలీజ్. ఇప్పుడు నాని ఉన్న రేంజ్ కు ఇది స‌రిపోతుంది.

హ‌లో వ‌స్తున్నా కూడా నానికి భారీగా థియేట‌ర్స్ వ‌చ్చాయి. దానికి కార‌ణం దిల్ రాజు అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఫ‌స్టాఫ్ కామెడీతో గ‌డిచినా.. సెకండాఫ్ అంతా ఎమోష‌న్స్ పై న‌డుస్తుంద‌ని చెప్పాడు రాజు. 2017లో ఇప్ప‌టికే నేనులోక‌ల్.. నిన్నుకోరితో భారీ హిట్లు అందుకున్న నాని.. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం చూస్తున్నాడు. ఓవ‌ర్సీస్ లో 230 స్క్రీన్స్ లో విడుద‌లైంది ఎంసిఏ. ఇప్ప‌టికే 30 కోట్ల మార్కెట్ సొంతం చేసుకున్న నాని.. ఈ చిత్రంతో క‌చ్చితంగా 40 కోట్ల మార్క్ అందుకునేలా క‌నిపిస్తున్నాడు. ఇదే జ‌రిగితే నాని టాప్ లీగ్ లోకి ఎంట‌రైపోయిన‌ట్లే.. అయితే తాజా ఈ సినిమాని కత్తి మహేష్ చూసి షాకింగ్ కామెంట్స్ చేసాడు. సినిమాలో కొత్తదనం ఏం లేదు.

ముఖ్యంగా నాని, సాయి పల్లవిల నటన సినిమాలో బాగుంది తప్ప.. స్టోరీ పరంగా కానీ కథనం పరంగా కానీ.. కొత్తగా ఏం లేదు. నాని కెరీర్ లో ఇది ప్లాప్ సినిమా అవుతుంది.. ఇలాంటి సినిమాలు ఇంతకు ముందే చాలానే వచ్చాయని.. ఇందులో ప్రత్యేకించి చెప్పడానికి ఏమి లేదని.. ఈ సినిమా చూసిన చూడకున్న ఒక్కటే అని.. ఫస్ట్ ఆఫ్ యవరేజ్ గా ఉండగా.. సెకండాఫ్ బోర్ కొట్టించాడు.. ఇక పై అయిన నాని ఇలా రొటిన్ స్టోరీలతో కాకుండా.. కొంచెం కొత్తగా ఉండే కథలతో సినిమాలు చేస్తే బాగుంటుందని కత్తి మహేష్ తన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలుస్తోంది

Loading...

Leave a Reply

Your email address will not be published.