రష్మీ చేసిన పనికి ఏడ్చేసిన సుధీర్.. కంటతడి పెట్టుకున్న ప్రియమణి.

Spread the love

తెలుగు టెలివిజన్ షో లో నెంబర్ వన్ షో గా దూసుకుపోతున్న డాన్స్ షో ఢీ. ఇప్పటికే 9 సీజన్స్ ని విజయవంతంగా పూర్తిచేసుకొని, 10 సీజన్ ని కూడా కొనసాగిస్తున్నారు షో నిర్వాహకులు. ఈ షో ఈ మధ్య కాలంలో ఇంకా బాగా పాపులర్ అయ్యింది. దీనికి కారణం డాన్సర్స్ మరియు యాంకర్ , టీమ్ లీడర్స్ , జడ్జెస్. డాన్సర్స్ ఎప్పటికప్పుడు తమ డాన్స్ లో కొత్తదనం చూపించడం, అలాగే మధ్య మధ్యలో యాంకర్ ప్రదీప్ , టీమ్ లీడర్స్ సుధీర్, రష్మీ చేసే కామెడీ టాస్క్స్ షో కి హైలెట్ గా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సుధీర్ చేసిన ఒక టాస్క్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

రష్మీ సుధీర్ కి మ్యాజిక్ చేసే టాస్క్ ఇచ్చింది. ఈ టాస్క్ లో భాగంగా సుధీర్ ఒక న్యూస్ పేపర్ ని చింపి దానిని మడతపెట్టి, ఆ తర్వాత యధాతంగా ముందు న్యూస్ పేపర్ ఎలా ఉందొ అలాగే చూపించాడు, అలాగే ఒక కాలీ క్లాత్ మడత పెట్టి అందులో నుండి ఒక పావురాన్ని తీసాడు. ఇది చూసిన జడ్జెస్, కంటిస్టన్స్, మిగతా టీమ్ లీడర్స్, యాంకర్ అందరు షాక్ అయిపోయారు. ప్రొఫెషనల్ మ్యాజిక్ మాన్ చేయినట్లే ప్రదీప్ కూడా చెయ్యడంతో ఒక్కసారిగా అందరు ఆశ్చర్యపోయారు.

టాస్క్ అనంతరం సుధీర్ మాట్లాడుతూ, నేను హైదరాబాద్ వచ్చి అన్నం తిన్నదానికి, ఇప్పుడు మా తల్లిదండ్రులు ఆనందంగా ఉండటానికి ఈ మ్యాజిక్కే అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు సుధీర్. జబర్దస్త్ కి వచ్చాక తానూ అసలు మ్యాజిక్ జోలికి వెళ్లలేదని, కానీ మల్లి 5 ఏళ్ళ తర్వాత ఢీ వల్ల మళ్ళీ ఆ మ్యాజిక్ ముట్టుకున్నాను అంటూ ఏడ్చేశాడు. నాకు అన్నం పెట్టింది ఇదే, దానిని ఈ వేదిక ద్వారా చూపించే అవకాశం ఇచ్చినందుకు ఢీ షో కి ధన్యవాదాలు తెలియజేశాడు సుధీర్.

Loading...

Leave a Reply

Your email address will not be published.