ట్రంపు.. బోరింగ్ పంపు.. తప్పు.. పప్పు.. ఒకేసారి ఇద్దర్ని ఏసుకున్నాడు..

Spread the love

జబర్దస్త్ కామెడీ షో మరోసారి వివాదంలో ఇరుక్కుంది. గతంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతినేలా చూపించారని కరీంనగర్‌లో కేసు నమోదు కాగా.. భారతీయ న్యాయవ్యవస్థను అవమానించారంటూ ఓ న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశాడు. దీనిని అంగీకరించిన కోర్టు.. జబర్దస్త్ టీంకు నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా ఇలాంటి అనేక వివాదాలు జబర్దస్త్‌ను చుట్టుముట్టాయి. కాగా మరోసారి జబర్దస్త్ కామెడీ షో ప్రదర్శించిన స్కిట్‌ ద్వారా తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు అనాథబాలలు. ఇటీవల ప్రదర్శించిన జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది అనాథలపై దారుణమైన జోక్స్ వేయడం వివాదానికి కారణమైంది.

‘జబర్దస్త్ ఆడియన్స్.. ఊపిరి పీల్చుకోండి.. ఆది వస్తున్నాడు అంటూ యాంకర్ అనసూయ ఓ రేంజ్‌లో హైపర్ ఆదికి, రైజింగ్ రాజుకి వెళ్కమ్ చెప్పేయడంతో ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది తనదైన శైలిలో పంచ్‌లు పేలుస్తూ.. అనాథలను కించపరిచే జోక్స్ వేశారు. ‘నన్ను చిన్నప్పుడు చెత్త కుండీలో పడేశారని అనాథ పాత్రధారిగా ఉన్న రైజింగ్ రాజు అంటే.. నీ లాంటి వాడిని చెత్త కుండీలో కాకుండా తిరుపతి హుండీలో వేస్తారా.. వీళ్లు అనాథల్లా లేరు.. పదికీ పాతికకు పీకలు కోసేలా ఉన్నారు వీళ్లు అనాథలు ఏంటి? ఇంతకీ అనాథలు అంటే ఏమిటో తెలుసా.. అతిగా ఆవేశపడే ఆడదానికి.. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానాన్నే అనాథలు అంటారని తనదైన శైలిలో బూతు కామెడీకి తెరతీస్తూ.. అనాథలపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. తాజా మళ్లీ మరో.. సారి ఆది పంచుల వర్షం కురిపించారు.

ఈ సారి మాత్రం.. ట్రంపు పై డైరెక్ట్ గా పంచు వేస్తే.. నారా లోకేష్ పై మాత్రం ఇన్డైరెక్ట్ గా పంచు వేశాడు. “ఆమెరికా నుంచి అవంతిక వచ్చిందటగా వెళ్లిపోయిందా అని లేడి గెటప్ లో ఉన్న శాంత్ స్వరూప్ అనగా.. దానికి పంచుగా అమె అవంతికా కాదే.. ఇవాంక అని ఆది సమాధనం ఇస్తాడు. అందుకు సమాధనంగా శాంతి స్వరూప్.. “ఆమె కూడా నాలేగే సన్నగా.. అందంగా ఉంటుంది కదా అని అనగా.. రివర్స్ లో ఆది “ఆమెకి నీకు.. ట్రంపుకి, బోరింగ్ పంపుకి ఉన్నంత తేడా ఉందని” పంచు విసరాడు. ఇక ఇంతలో దొరబాబు ఎంట్రీ ఇస్తాడు.. ఏంట్రా నువ్వు ఇంకా మారాలేదా అని ఆది అడగటంతో.. ఏదో మిస్టేక్ లో లేరా అని దొరబాబు అంటాడు. అప్పుడు ఆది ” ఒక్కసారి మిస్టేక్ చేస్తే తప్పు అంటారు.. పదే పదే చేస్తే పప్పు అంటారు అని” తన శైలిలో పంచు వేశాడు. ఇక్కడ ఆది ఒకేసారి ట్రంపుకి, లోకేష్ కి పంచు వేశాడు.

Loading...

Leave a Reply

Your email address will not be published.