బుద్ది ఉందా..? ఆడదానివేనా..?  పవన్ కళ్యాన్ గారిని తిడుతావా..? అనసూయ ఫైర్..!

Spread the love
పవన్‌ కల్యాణ్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ పై అనకుండని మాటలు అంటూ విరుచుకుపడ్డారు. తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తుంటే మద్దతు ఇవ్వకుండా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ఒక్కొక్కడి జాతకాలు బయటకు వచ్చినప్పుడు అభిమానులు రెచ్చిపోవద్దన్నారు. ఒక అమ్మాయి ధైర్యంగా నోరు విప్పినప్పుడు పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. ముగ్గురిని పెళ్లి చేసుకున్న పవన్‌ కల్యాణ్‌కు అసలు అమ్మాయిల పట్ల విలువ ఉందా అని ప్రశ్నించారు. ప్రజా నాయకుడై ఉండి పోలీస్ స్టేషన్‌కు వెళ్లు అంటూ సలహా ఇస్తావా.. మాకు తెలియదా అని శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు. పవన్‌ కల్యాణ్‌ను ఇది వరకు అన్న అని సంబోధించానని…. అందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా అంటూ తన చెప్పు తీసుకుని శ్రీరెడ్డి మీడియా ముందే కొట్టుకున్నారు.
ఇకపై ఏ అమ్మాయి కూడా పవన్‌ కల్యాణ్‌ను అన్న అనవద్దని ఆమె పిలుపునిచ్చారు. ఆఖరిలో పవన్‌ కల్యాణ్‌ ను ఉద్దేశించి  మధ్యవేలు చూపిస్తూ విరుచుకుపడింది శ్రీరెడ్డి.  ఫ్యాన్స్‌ను కంట్రోల్‌లో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా హెచ్చరించింది ఆమె. పవన్ కళ్యాణ్ మీద శ్రీరెడ్డి తిట్ల దండకాన్ని చాలామంది తప్పుబడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై అనసూయ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. శ్రీరెడ్డి నీ పోరాటం నువ్వు చేసుకో అంతే కానీ.. న్యాయం కోసం పోలీసు స్టేషన్ కి వెళ్ళమంటే అలాంటి బూతులు తిడుతావా.. అసలు నువ్వు ఆడదానిలా మాట్లాడుతున్నావా.. ఏంటా మాటలు.. న్యాయపరంగా వెళ్లాలి కానీ.. ఇలా డిబేట్ లు పెట్టి.. అనోసరంగా మధ్యలోకి పవన్ కళ్యాణ్ గారిని లాగడం సరికాదని.. ఇప్పటికైన మారి.. సరిగ్గా నీ పని నువ్వు చూసుకుంటే మంచిదని.. లేకుంటే అందరు నీపై విరుచుకు పడటం ఖాయమని అనసూయ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
Loading...

Leave a Reply

Your email address will not be published.