రవితేజ నీ తాట తీస్తా – జగపతిబాబు..!

Spread the love

అవును.. మీరు చదువుతోంది నిజమే! మాస్ మహారాజా రవితేజ మీద జగపతిబాబు ఫుల్ ఫైర్‌లో ఉన్నాడు. అతని తాట తీసేందుకు పన్నాగాలు పన్నుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతని అంతుచూడాలని జగపతి బాగా కసిగా ఉన్నాడు. కాకపోతే రియల్ లైఫ్‌లో కాదులెండి.. రీల్ లైఫ్‌లో! విలన్‌గా మారినప్పటి నుంచి జగపతిబాబు మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. కేవలం విలన్‌గానే కాకుండా వైవిధ్యభరితమైన పాత్రలూ పోషిస్తూ ఆయన దూసుకెళ్తున్నాడు. అయితే.. ఈమధ్య ఆయన తెలుగులో విలన్‌గా కంటే సాఫ్ట్ క్యారెక్లర్లే ఎక్కువగా చేశాడు.

ఇప్పుడు ఆయన మరోసారి ఉగ్రరూపం దాల్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో మాస్ మహారాజా రవితేజ హీరోగా చేస్తున్న మూవీలో జగపతిబాబు విలన్‌గా చేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా చిత్రబృందంకి సంబంధించిన ఒక సభ్యుడే వెల్లడించాడు. ‘‘ఈ మూవీలో విలన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. రవితేజతో నువ్వా-నేనా అన్నట్టుగా ఈ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఈ విషయంలో హీరో-విలన్ ఇద్దరూ సమఉజ్జీల్లా ఉంటారు. అందుకోసమే.. ఈ విలన్ పాత్రకి జగపతిబాబును సంప్రదించాం. ఈ పాత్రను ఆయన దాదాపుగా ఓకే చేసే అవకాశం ఉంది’’ అని ఆ సభ్యులు తెలిపాడు. మొత్తానికి.. చాలా గ్యాప్ తర్వాత జగపతి మళ్ళీ విలన్‌గా తన సత్తా చాటుకోబోతున్నాడన్నమాట. ‘టచ్ చేసి చూడు’ షూటింగ్ ముగిశాక ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళనుంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.