లైవ్ లో దొరికిపోయిన వేణు స్వామి భార్య ప్రస్తుతం టాప్ తెలుగు యాంకర్ అని మీకు తెలుసా..?

Spread the love

ఇటీవల ఇద్దరు వ్యక్తులు బాగా ట్రెండ్ అయ్యారు.. ఒకరు అజ్ణాతవాసి సినిమా ఆడియో ఫంక్షన్ ద్వారా ట్రెండ్ అయిన వీణ శ్రీవాణి.. మరొకరు బాబు గోగినేని చేతిలో అడ్డంగా బుక్కయిన ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామి.. వీరిద్దరూ భార్యాభర్తలన్న విషయం అతికొద్దిమందికే తెలుసు… ఒకప్పుడు ఒక టివి ఛానెల్ యాంకర్ గా, బుల్లితెర నటిగా తన ప్రస్థానం ప్రారంభించిన శ్రీవాణిలో మరొక టాలెంట్ ఉంది. అదే వీణ మీద అన్ని రకాల పాటలను వాయించడం. చిన్నతనం నుండే వీణ వాయించడంలో ప్రావీణ్యం ఉన్నప్పటికీ సరైన గుర్తింపు రాలేదు.. కానీ మెల్లిగా సోషల్ మీడియా ద్వారా తన టాలెంట్ ను బైట పెట్టారు. శ్రీవాణి.. జానపదాలు, సినిమాపాటలు అనేక రకాల పాటలను వీణ మీద వాయించి ఆ వీడియోలను ఫేస్ బుక్ పేజ్ లో పోస్టు చేసేవారు.. ఆ తర్వాత యూట్యుబ్ లో పెడుతుండడంతో అభిమానుల సంఖ్య పెరిగింది..

మొదటిసారిగా అజ్ణాతవాసి ఆడియో షో ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యారు. అజ్ణాతవాసి ఆడియో లాంచ్ ప్రోగ్రామ్ లో వీణ మీద ఈవిడ వాయించిన పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సాంగ్స్ అన్ని ప్రేక్షకులను అలరించడమే కాదు.. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి.. ఇటీవల ఈమె భర్త కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు.. అయన ఎవరో కాదు ఆస్ట్రాలజిస్ట్ వేణుస్వామి. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణుస్వామి ఒకసారిగా నాకు జ్యోతిష్యం రాదు, నన్ను నమ్మకండి అని చెప్పి ఒక లైవ్ షో నుండి వెళ్లిపోయారు.. కాదు వెళ్లిపోయేలా చేశారు బాబు గోగినేని.. ఇప్పటివరకు తాను చెప్పిన వందకు తొంభై జరిగాయని తన ప్రతి కార్యక్రమంలో చెప్పుకునే ఈయన ప్రతిసారి కూడా ఫలాన వ్యక్తి అనారోగ్యం పాలవుతాడు.. ఫలాన ముఖ్యమంత్రికి ప్రాణగండం ఉంది.. ఫలాన కథానాయకుడు సినిమా ప్లాప్ అవుతుంది అంటూ ఈ విధంగా సంచలన వ్యాఖ్యలు చేసేవారు. అలాంటి వ్యాఖ్యలతో అందరి అటెన్షన్ ను తనవైపు కు తిప్పుకునేవారు. దాంతో ఈ మధ్య ఒక టీవీ ఛానెల్ ఏర్పాటు చేసిన లైవ్ లో బాబు గోగినేని వేణుస్వామి చెప్పిన వందలో తొంభైతొమ్మిది ఫెయిల్ అయ్యాయని ప్రూవ్ చేశారు..

అంతేకాదు ప్రధాని మోడిని కలవకుండా కలిశానని పెట్టిన ఫోటో మార్పింగ్ ది అని కూడా ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇచ్చారు. దాంతో వేణు స్వామి ‘నాకు జ్యోతిష్యం రాదు.. నన్ను నమ్మకండి’ అంటూ చేతులెత్తి దండం పెట్టి లైవ్ షో నుండి వెళ్లిపోయారు.. తర్వాత బాగా ట్రోల్ అయ్యారు. ఇక వారి పర్సనల్ జీవితం విషయానికి వస్తే.. వేణుస్వామి, వీణావాణి.. ఇద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరు కూడా సోషల్ మీడియా లో బాగా ఫేం సంపాదించారు.. ఐతే ఒకరికేమో పాజిటివ్ వస్తే ఇంకొకరికేమో నెగిటివ్ వచ్చింది.

Loading...

Leave a Reply

Your email address will not be published.