రేణు ని సీక్రెట్ గా కలిసిన సురేఖ.. ఎందుకో తెలుస్తే బిత్తరపోతారు

Spread the love

ఎప్పుడూ శాంతంగా కనిపించే రేణు దేశాయ్‌కి కోపమొచ్చింది. మహిళల పట్ల, మహిళలు రెండో వివాహం చేసుకోవడం పట్ల కొందరు సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్లపై రేణు గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరిగా ఉండటం కష్టమనిపిస్తోందని.. తనను అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే పెళ్లి గురించి ఆలోచిస్తానని గతంలో రేణు దేశాయ్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆమె మళ్లీ పెళ్లిచేసుకోవడం అనే విషయాన్ని అసహ్యించుకుంటూ కొందరు ‘హేట్ మెసేజ్‌లు’ చేస్తున్నారని రేణు దేశాయ్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఇది తన ఒక్కదానికి ఎదురవుతున్న పరిస్థితి కాదని మహిళలంతా ఎదుర్కొంటున్న పరిస్థితి అంటూ తన ఆవేదనను రేణు వెలిబుచ్చారు.

నాకు ఒక లైఫ్ పార్ట్‌నర్ ఉంటే బాగుండు అని కేవలం చెప్పినందుకు నాకు హేట్ మెసేజులు పంపుతున్నారు. మన దేశంలో ఒక మగాడు ఏమైనా చేయొచ్చు, ఎన్నిసార్లైనా పెళ్లిచేసుకోవచ్చు. కానీ, ఒక అమ్మాయి ఇంకో రిలేషన్ గురించి ఆలోచించడం కూడా తప్పు! తను జీవితాంతం, తప్పు చేశానన్న ఫీలింగ్‌తో ఒంటరిగా బతకాలా??? ఈ దేశంలో అమ్మాయిల భవిష్యత్తు బాగుండాలంటే, మహిళలే వాల్ల కొడుకులను పద్ధతిగాపెంచాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తు్నాను. అప్పుడైనా మగవాళ్ల మైండ్‌సెట్‌లో మార్పు వస్తుందేమో’ అని రేణు కామెంట్స్ చేశారు. అలానే తన పెళ్లికి పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా మద్దతు ఇచ్చారని.. మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోమని చెప్పడని ఇటివలే రేణు తెలిపింది.

అయితే తాజాగా రేణు దేశాయ్ ని.. చిరంజీవి భార్య సురేఖ కలిసినట్లు తెలుస్తోంది. ఈ న్యూ ఇయర్ కి పిల్లలను తీసుకొని ఇంటికి రావలి.. పిల్లలను చూడాలి అనిపిస్తొందని.. రేణుతో సురేఖ అన్నారట. అందుకు రేణు కూడా ఖచ్చితంగా పిల్లలను తీసుకొని వస్తానని తెలిపిందట. రేణుకి, పవన్ కి పుట్టిన పిల్లలు అకీరా, ఆద్యా.. వీళ్లంటే పవన్ కి మాత్రమే కాదు.. చిరు ఫ్యామిలీకి కూడా తెగ ఇష్టం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.