అల్లు అర్జున్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి

Spread the love

మెగా ఫ్యామిలీకి చెందిన సినిమా ఫంక్షన్లు జరిగినపుడు అభిమానులు గోల చేయడం, వారి మూలంగా వేదిక మీద మాట్లాడేవారు ఇబ్బంది పడటం లాంటివి గతంలో చూశాం. ఓ సారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గోల చేస్తుంటే బన్నీ గట్టి వార్నింగే ఇచ్చాడు. అప్పట్లో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా మరోసారి బన్నీకి అలాంటి సందర్భమే ఎదురైంది. ఈ నేపథ్యంలో బన్నీ మరోసారి సహనం కోల్పోయారు. అల్లు శిరీష్‌, సుర‌భి, సీర‌త్ క‌పూర్, అవ‌స‌రాల శ్రీనివాస్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా `ఒక్క క్ష‌ణం`. వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్నీ అభిమానుల తీరుతో విసిగిపోయారు.

తాను మాట్లాడుతుంటే అభిమానులు గోల చేయడంతో బన్నీ సహనం కోల్పోయారు. “ఫ్యాన్స్ అందరికీ ఒకటే రిక్వెస్ట్… ఎవరైనా మాట్లాడేపుడు ఎదురు మాట్లాడటం సంస్కారం కాదు. ఫంక్షన్ పెట్టిందే సరదాగా అరవడానికి… కానీ మనిషి మాట్లాడేపుడు కాదు. అది బేసిక్ రెస్పెక్ట్.” అంటూ బన్నీ ఫైర్ అయ్యారు. “సినిమా వేడుకల్లో అయినా సరే, మరెక్కడ అయినా సరే…. ఒకరి ఫీలింగ్ చెప్పుకునేపుడు అడ్డు పడకూడదు. ఎవరి విషయంలో అయినా అంతే. మాట్లాడేపుడు ఎవరైనా అడ్డం వస్తే వారి పేరు ఎత్తిమరీ చెబుతా. ప్లీజ్ డోంట్ డ్రిస్ట్రబ్ మి.” అని అన్నాడు.

అయితే ఇదే విషయంపై అల్లు అర్జున్ కి చిరంజీవి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట. అల్లు అర్జున్ గతంలో కూడా ఇలా మాట్లాడే తప్పు చేశావ్.. అభిమానులు అంటే అల్లరి చేస్తారు. వాళ్ల జోలికి పోవద్దు అని గతంలోనే నీకు చెప్పను అయిన నువ్వు వినడం లేదు. ఇలా అయితే అభిమానుల దృష్టిలో నువ్వు విలన్ అవుతావ్.. ఇప్పటికైన మారి అభిమానులతో సరదాగా.. మంచిగా ఉండమని అల్లు అర్జున్ కి చిరు సలహతో పాటు వార్నింగ్ ఇచ్చినట్లు టాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

Loading...

Leave a Reply

Your email address will not be published.