పవన్ బూతులు తిట్టిన శ్రీరెడ్డికి మెగాస్టార్ ఎలాంటి కౌంటర్ ఇచ్చాడో చూడండి

Spread the love
ఇన్ని రోజుల వరకు చలన చిత్ర పరిశ్రమలో తెలుగు వాళ్లకే అవకాశమివ్వాలంటూ నినాదాలు చేసిన శ్రీ రెడ్డి. ఆ తర్వాత కాస్టింగ్ కౌచ్ పైనే నా పోరాటం అంటూ జనాలకు షాక్ ఇచ్చే ప్రకటన చేసింది. ఉన్న చర్చలన్నీ ఒకవైపు అయితే ఇప్పుడేమో ఉన్నట్టుండి పవన్ కల్యాణ్ నే టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇస్తే బాగుంటుంది కదా అని పవన్ సలహా ఇచ్చిన పాపానికి, అతడిని అనరాని మాటలంది సంచలన నటి శ్రీరెడ్డి. అసలు నిజం ఏంటంటే ఇక్కడ తప్పు శ్రీరెడ్డిదే అని చాలా క్లియర్ గా కాదనిపిస్తోంది, కానీ వీటన్నింటి వెనుక ఓ వర్గం ఆమెకు సపోర్టుగా నిలిచిందనిపిస్తుంది. ఆ వర్గమే ఆమెతో ఇలా మాట్లాడిస్తోంది అని కూడా అనుకోవచ్చు. ప్రెస్ మీట్లు పెట్టిస్తోంది. చర్చల్లో పాల్గొనేలా చేస్తోంది. లక్షలకు లక్షలు తెరవెనక అప్పగిస్తోంది. ఇదంతా కావాలని జరుగుతోంది. ఎందుకు? అని ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. అన్నింటికంటే ముందు శ్రీ రెడ్డికి కావాల్సింది ఇది కాదు. ఆమె కేవలం తన సినీ అవకాశాల కోసం మాత్రమే బయటకొచ్చింది.
అవసరమైతే తన దగ్గరున్న వీడియోలు, వాట్సాప్ స్క్రీన్ షాట్స్ బయటపెట్టాలని మాత్రమే అనుకుంది. ఒక దశలో మా అసోసియేషన్ కూడా శ్రీ రెడ్డి నిర్ణయానికి తల వంచి ముందుకు వచ్చి తను కోరుకున్నది తీరుస్తానని చెప్పింది. శ్రీరెడ్డికి మీడియా ముఖంగా స్వాగతం పలికింది. అక్కడితో శ్రీరెడ్డి సమస్య పరిష్కారమైంది. కానీ శ్రీరెడ్డిని అక్కడితో ఆగనీయలేదు ఓ వర్గం. ఆమెకు ఇటు పత్రికా, టీవీ మీడియాలో, అటు సోషల్ మీడియాలో వచ్చిన ఇనిస్టెంట్ క్రేజ్ చూసి, దాన్ని మరోలా వాడుకోవాలని ఫిక్స్ అయింది. అందుకే మా అసోసియేషన్ లో మేటర్ క్లియర్ అయిన తర్వాత కూడా కొన్ని మహిళా సంఘాలు శ్రీరెడ్డిను వీడలేదు. నిజం చెప్పాలంటే కొన్ని ఛానెల్స్ కూడా శ్రీరెడ్డిని వదల్లేదు. ఇలా రెండూ కలిసి ఒక్కటయ్యాయి. పవన్ ను పాయింట్ బ్లాక్ లో పెట్టి టార్గెట్ చేసాయి. ఈ ఒక్క దెబ్బతో అటు కాస్టింగ్ కౌచ్, ఇటు శ్రీరెడ్డి లీకులు అన్నీ సైడ్ అయిపోయాయి. అసలు కాస్టింగ్ కౌచ్ తో మొదలైన ఈ చర్చలు పవన్ మీదకు మర్లాయి అంటే శ్రీ రెడ్డి వెనకున్న ఆ వర్గమే కారణం. తాజాగా విడుదలై తెలుగు ఇండస్ట్రీలో రచ్చ చేసిన సినిమా అర్జున్ రెడ్డి డైలాగ్ ను, అర్జున్ రెడ్డిలో పాపులర్ అయిన ఓ చర్యను యాజ్ ఇటీజ్ గా పవన్ పై వాడేసింది ఈ సంచలన నటి శ్రీరెడ్డి. ఒక విధంగా చెప్పాలంటే ఇది బరితెగించడమే. ఒక ముఖ్య మంత్రి పదవికి పోటీ చేస్తున్న సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడైన పవన్ ను అలా అనడం నిజంగా సమంజసమైన విషయం కాదు. పవన్ అన్నదానికి ఇంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు.
కానీ కావాలనే ఇష్యూను పెద్దది చేసి రాద్దాంతం చేయాలని ప్రయత్నించారు. కానీ ఈ విషయం ఎక్కడి వరకు దారితీస్తుందో వేచి చూడాలి మరి. అయితే ఈ విషయం మెగాస్టార్ వరకు వెళ్లిందని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఆయన శ్రీరెడ్డి పై చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఒక నాయకుడి మీద ఇలా కామెంట్స్ చెయడం కరెక్ట్ కాదు.. నీకు మా అసోసేషన్ వాళ్లు న్యాయం చేస్తారని మాట ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి మాట్లాడ సరికాదు.. ఇన్ని రోజులు నీకు అవకాశాలు కోసమే ఇలా చేస్తున్నావు అనుకున్నాను కానీ.. ఇదంత నువ్వు కావాలనే చేస్తున్నావు అని అర్దం అయింది. అయిన పవన్ వెనక నా కుటుంబం.. అభిమానులు ఉన్నారు.. మరోసారి మాట జారి కూడా పవన్ కళ్యాణ్ ను కానీ నా కుటుంబం పై కానీ ఒక్క మాటన్న బాగుండదని శ్రీరెడ్డి పై మెగాస్టార్ పైర్ అయినట్లు తెలుస్తోంది.
Loading...

Leave a Reply

Your email address will not be published.